Home /News /movies /

MEGA BROTHER NAGABABU SERIOUS WORKOUTS TO INCREASE THE RATING OF ADIRINDI SHOW TA

మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ స్కెచ్ ... వర్కౌట్ అయితే..

నాగబాబు (Nagababu)

నాగబాబు (Nagababu)

జబర్దస్త్ రేటింగ్స్ ను బీట్ చెయ్యడమే లక్ష్యంగా నాగబాబు రంగంలోకి దిగినట్టు సమాచారం. అందుకోసం ఏకంగా..

    మెగా బ్రదర్ నాగబాబు ఇటీవలె ఈటీవీలో ప్రసారమయ్యే  సూపర్ హిట్ కామెడీ షో జబర్దస్త్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ యాజమాన్యం మల్లెమాలతో విభేదాలు, ఆర్ధిక లావాదేవీల కారణంగా జబర్దస్త్ ను వీడి.. జీ తెలుగులో కొత్తగా  ‘అదిరింది’ వేదికపైకి ఒచ్చినట్టు ప్రకటించారు నాగబాబు. అయితే ఈ 'అదిరింది' షో యాజమాన్యం ఊహించిన సక్సెస్ సాధించడం లో వెనకపడింది. ఇదిలా వుంటే చాలామంది జబర్దస్త్ కమెడియన్స్ ప్రస్తుతం 'అదిరింది' షో కి షిఫ్ట్ అయ్యారు. ఈ షో కాన్సెప్ట్ కూడా జబర్దస్త్ కాన్సెప్టే కావడంతో ఈ రెండు షోల మధ్య పోటీ పెరుగుతున్న యాజమాన్యానికి ఒక రకంగా టీఆర్ఫీ రేటింగ్ షాక్ ఇవ్వడమేకాక ,జబర్డస్త్‌కి ఏ మాత్రం పోటీ ఇవ్వట్లేదని సమాచారం. మరోవైపు జబర్దస్త్ మాత్రం అదే జోష్ కంటిన్యూ చేస్తోంది. నాగబాబు వెళ్ళాక కూడా కనీసం 9 టీఆర్ఫీ మెయింటేన్ చేస్తూ దూసుకుపోతోంది. ఈ రిపోర్ట్స్ చూసిన జనం.. జబర్దస్త్ వీడిన నాగబాబు అనుకున్న మేర సక్సెస్ కానట్లే అని చెప్పుకుంటున్నారు. అయితే ఇలాంటి పరిస్థితులలో జబర్దస్త్ రేటింగ్స్ ను బీట్ చెయ్యడమే లక్ష్యంగా నాగబాబు రంగంలోకి దిగినట్టు సమాచారం. ఈ క్రమంలోనే కొత్త స్టార్లను రంగంలోకి నాగబాబు దింపుతున్నారట. అంతేకాదు ఈ కొత్త ఆర్టిస్టులతో సరికొత్త కామెడీ ట్రాక్ సిద్ధం చేస్తున్నారట.

    Jabardasth Comedy Show production house Mallemala war still continue with Nagababu Adirindi pk జబర్ధస్త్ కామెడీ షోను వదిలేసి ఇప్పుడు జీ తెలుగుతో బిజీగా ఉన్నాడు నాగబాబు. ఈయన ఏడేళ్లకు పైగా నవ్వుల నవాబుగా ఉన్నా కూడా ఎందుకో తెలియదు కానీ మల్లెమాలపైనే విమర్శల వర్షం కురిపించాడు మెగా బ్రదర్. jabardasth comedy show,adirindi comedy show,nagababu mallemala productions,jabardasth comedy show secrets,jabardasth comedy show judge,jabardasth nagababu,nagababu channel,nagababu my channel naa istam,nagababu interview,jabardasth comedy show episode,jabardasth comedy show latest episode,jabardasth latest promo,jabardasth comedy show directors,jabardasth comedy show mallemala,jabardasth comedy show shyam prasad reddy,jabardasth comedy show promo,sudigali sudheer,rashmi gautam,anasuya bharadwaj,telugu cinema,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ జాతకం బయటపెట్టిన నాగబాబు,నాగబాబు ఛానెల్,నాగబాబు మై ఛానెల్ నా యిష్టం,నాగబాబు జబర్దస్త్,జబర్దస్త్ సీక్రేట్స్,తెలుగు సినిమా
    నాగబాబు (youtube/Photo)


    అటు అదిరింది యాజమాన్యం కూడా షోలో కొన్ని మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. యూబ్యూబ్‌లో కామెంట్ల రూపంలో వస్తున్న ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్‌ని పరిగణనలోకి తీసుకొని.. అందుకు తగ్గట్లుగా మార్పులు చేర్పులు చేస్తున్నారని టాక్. అంతేకాకుండా యూబ్యూబ్‌లో నెటిజన్స్ ఇచ్చిన సలహా మేరకు పటాస్ స్టార్స్‌ని కూడా 'అదిరింది' లోకి లాగేస్తున్నారట. మరి ఈ కొత్త స్కెచ్చ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాల్సిందే.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Adirindi comedy show, Jabardasth comedy show, Nagababu, Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు