Nagababu: నెపోటిజంపై నాగబాబు సెన్సేషనల్ వ్యాఖ్యలు..

Naga Babu | మెగా బ్రదర్ నాగబాబు..నటుడిగా కంటే యాంకర్‌గా ఎక్కువ పాపులర్ అయ్యాడు. అంతేకాదు ఈయన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఈయన టాలీవుడ్‌లో నెపోటిజంపై మాట్లాడారు.

news18-telugu
Updated: August 27, 2020, 10:12 PM IST
Nagababu: నెపోటిజంపై నాగబాబు సెన్సేషనల్ వ్యాఖ్యలు..
నాగబాబు (Youtube/Credit)
  • Share this:
మెగా బ్రదర్ నాగబాబు..నటుడిగా కంటే యాంకర్‌గా ఎక్కువ పాపులర్ అయ్యాడు. అంతేకాదు ఈయన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. అంతేకాదు ఎప్పటి కపుడు సినిమా, రాజకీయాలపై తనదైన శైలిలో వివాదాస్పద ట్వీట్స్ చేస్తూ ఉంటాడు. తాజాగా ఈయన టాలీవుడ్‌లో ఉన్న నెపోటిజం పై సంచలన వ్యాఖ్యలు చేస్తే వీడియోలు విడుదల చేసారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. తన అన్నయ్య .. 22 కుర్రాడిగా ఏ గాడ్ ఫాదర్ లేకుండా అదే సపోర్ట్ లేకుండా పెద్ద స్టార్ అయ్యాడని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత మా ఫ్యామిలీలో అల్లు అర్జున్.. జమ్నాస్టిక్స్, డాన్స్ , నటననేర్చుకొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అతనికి ఏది రెడీమేడ్‌గా తెచ్చుకోలేదు. అన్ని విషయాల్లో పట్టు పెంచుకున్నాడు. అటు రామ్ చరణ్ కూడా చిరంజీవిని చూసి నటన, డాన్సులు, గుర్రం గట్రా నేర్చుకొని ఇపుడు స్టార్ హీరోగా ఎదిగిన విషయాన్ని చెప్పాడు. బన్ని, రామ్ చరణ్ వంటి వాళ్ల బాడీ రావాలంటే తల్లో జేజమ్మ దిగిరావాలన్నారు. వాళ్ల నాన్న సంపాదించినది తింటూ కూర్చోవచ్చుగా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు.


అలాగే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన సాయి ధరమ్ తేజ్ కూడా ఎంతో కష్టపడి పైకొచ్చాడు. మధ్యలో ఫ్లాపులు వచ్చినా.. మేమిమి ఆడించలేదుగా అని కాస్త ఎమోషనల్ అయ్యాడు. చిత్రలహరి నుంచి మళ్లీ ట్రాక్‌లో పడ్డ విషయాన్ని చెప్పుకొచ్చాడు. అటు వరుణ్ తేజ్ ఇంట్రడ్యూస్ చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు. కానీ ఠాగూర్ మధు ఇంట్రడ్యూస్ చేసాడు. ఇక ఫిదా విషయంలో హీరోయిన్ సాయి పల్లవికి నటనలో కాస్త ఎక్కువ స్కోప్ ఉన్న అవేమి పట్టించుకోకుండా నటించాడు.

అటు వైష్ణవ్ తేజ్ కూడా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఒకటి రెండు సినిమాలు మాత్రమే చూస్తారు. ఆ తర్వాత సొంత టాలెంట్ ఉంటేనే పైకి వస్తారన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. మొత్తంగా నెపోటిజం బంధు ప్రీతి ఎంత ఉన్న ఒకటి రెండు సినిమాల వరకే పరిమితం. మా వాళ్లు అని వాళ్లను గాలికి ఒదిలేయాలా అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇండస్ట్రీలో నెగ్గుకురావాలంటే సొంత టాలెంట్  దమ్ము, ధైర్యం  ఉండాల్సిందే అంటూ చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీ అందరికీ ఓపెన్‌గా ఉంది. మీలో సత్తా దమ్ము, ధైర్యం, కెపాసిటీ ఉన్న ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీ ఓపెన్‌గా ఉంది. మా వాళ్లు బాగుపడి పోతున్నారు. ఇండస్ట్రీలో నెపోటిజం అనే పదం వాడటం కామన్ అయిపోయింది. నెపోటిజం మాట వాడటం అనేది మీ చాతకానీతనం. అంతేకాదు చాలా మంది స్టార్ హీరోల కొడుకులు సక్సెస్ కాకుండా ఇళ్లకు వెళ్లినపోయినవారున్నారు. మొత్తానికి నాగబాబు చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు. మరోవైపు నెపోటిజం వల్ల వేరే వాళ్లకు అవకాశాలు రాకుండా చేస్తున్నారన్న విమర్శలున్నాయి.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 27, 2020, 10:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading