వాళ్లే మా ఫ్యామిలీకి తీరని అన్యాయం చేసారు.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు..

వాళ్లే మా కుటుంబానికి తీరని అన్యాయం చేసారని నాగబాబు తన ఆవేదన వ్యక్తం చేసాడు. అంతేకాదు  మెగా ఫ్యామిలీ రాజకీయ ఎదుగుదలకు ఆ శక్తులే అడుగడున అడ్డుగా నిలిచిందని తన యూట్యూబ్‌ చానెల్‌లో ఆవేదన వెలిబుచ్చాడు మెగా బ్రదర్.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: May 13, 2019, 7:45 PM IST
వాళ్లే మా ఫ్యామిలీకి తీరని అన్యాయం చేసారు.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు..
మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ (Chiranjeevi pawan Kalyan nagababu)
  • Share this:
తెలుగు మీడియాలోని ఒక వర్గం మా కుటుంబానికి తీరని అన్యాయం చేసిందని నాగబాబు తన ఆవేదన వ్యక్తం చేసాడు. అంతేకాదు  మెగా ఫ్యామిలీ రాజకీయ ఎదుగుదలకు మీడియా అడుగడున అడ్డుగా నిలిచిందని తన యూట్యూబ్‌ చానెల్‌లో ఆవేదన వెలిబుచ్చాడు మెగా బ్రదర్. వివరాల్లోకి వెళితే.. ప్రజారాజ్యం పార్టీ పెట్టక ముందు హీరోగా చిరంజీవి రేంజ్ వేరు. కానీ పార్టీ పెట్టిన తర్వాత ఆయన పరిస్థితికి కారణం మీడియా అని తన యూట్యూబ్ చానెల్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. అప్పట్లో కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలు రెండింటికి తమ కంటూ సొంత మీడియా ఉన్నాయి. అంతేకాదు వాళ్లకు వత్తాసు పలికే ఛానెల్స్ కావాలనే చిరంజీవిపై కక్ష్యతో లేనిపోని కల్లబొల్లి కబుర్లు చెప్పాయన్నారు. దీంతో చిరుపై ప్రజల్లో రాంగ్ ఇండికేషన్స్ వెళ్లడంతో ఆయన 2009 ఎన్నికల్లో ఓడిపోయారన్నారు.

mega brother nagababu sensational comments on telugu media.. if media supports my brother chiranjeevi that time praja rajyam came into power,chiranjeevi,nagababu,megastar chiranjeevi,jabardasth comedy show,jabardasth comedy show,roja,jabardasth roja,andhra pradesh news,andhra pradesh politics,naga babu,nagababu sensational comments on telugu media,nagababu chiranjeevi prajarajyam,nagababu pawan kalyan janasena,nagababu about pawan kalyan,pawan kalyan,naga babu about chiranjeevi,nagababu interview,naga babu interview,chiranjeevi movies,mega family,nagendra babu,chiranjeevi and pawan kalyan,mega star chiranjeevi,naga babu about pawan kalyan,naga babu latest interview,nagababu speech,chiranjeevi brother,chiranjeevi hit songs,chiranjeevi hit movies,chiranjeevi interview,nagababu youtube,nagababu youtube channel,నాగబాబు,నాగబాబు చిరంజీవి,మెగాస్టార్ చిరంజీవి,జబర్దస్త్ కామెడీ షో,జబర్ధస్త్ కామెడీ షో,తెలుగు మీడియా పై నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్,నాగబాబు ప్రజారాజ్యం చిరంజీవి,నాగబాబు జనసేన పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్,
పవన్ కళ్యాణ్, నాగబాబు (File)


అంతేకాదు అన్నయ్య చిరంజీవికి మీడియా సపోర్ట్ లేదు కాబట్టే రాజకీయాల్లో ప్రభావం చూపించలేకపోయారని నాగబాబు తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు. ఏమైనా నాగబాబు చేసిన వ్యాఖ్యల్లో కొంత నిజం ఉన్నా..  రాజకీయాల్లో చిరంజీవికి వేచి చూసే ధోరణి లేక తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసాడని మిగిలిన పార్టీల వాళ్లు ఆరోపిస్తున్నారు. ఏమైనా నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
First published: May 13, 2019, 7:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading