Naga Babu: కరోనా నుంచి కోలుకున్న మెగా బ్రదర్ నాగబాబు..

Naga Babu (నాగబాబు)

Nagababu Corona Virus | దేశవ్యాప్తంగా కరోనా కేసులు అంత కంతకు  పెరిగిపోతున్నాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు.

  • Share this:
    Nagababu Corona Virus | దేశవ్యాప్తంగా కరోనా కేసులు అంత కంతకు  పెరిగిపోతున్నాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీతో పాటు రాజమౌళి కుటుంబం కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు. కానీ కొంత మందిని మాత్రం కరోనా మహామ్మారి తిరిగి రాని లోకాలకు తీసుకెళ్లింది. తాజాగా గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్యణ్యంను కరోనా బలి తీసుకుంది. ఇక మెగా బ్రదర్ నాగబాబు కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన సామాజిక మాధ్యమాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజగా నాగబాబు కరోనా నుంచి కోలుకున్నట్టు అదే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పాటు ప్రేక్షకులకు తెలియజేసారు.అంతేకాదు హోం ఐసోలేషన్ తర్వాత తాను కరోనాతో ఎదుర్కొన్న అనుభవాలు, తీసుకున్న జాగ్రత్తలను వీడియో ద్వారా పంచుకున్నారు. ఈ సందర్భంగా తాను ఐదుసార్లు కరోనా టెస్టులు చేయించుకున్నట్టు తెలిపారు. నిహారిక ఎంగేజ్మెంట్‌ కోసం ముందుగా కరోనా టెస్ట్ చేయించుకున్నట్టు తెలిపారు.

    రీసెంట్‌గా చలి జ్వరంతో పాటు కాస్తా మత్తుగా ఉండటంతో టెస్ట్ చేయించుకున్నాను. అందులో తనకు పాజిటివ్ వచ్చిందన్నారు. ముందుగా తనకు కరోనా పాజిటివ్ అని తెలియడంతో ఏదో తెలియని ఆందోళనకు గురైనట్టు చెప్పుకొచ్చారు. గతంలో న్యూమెనియా ఉండటంతో ఆసుపత్రిలో చేరినట్టు తెలిపారు. ఐదు రోజలు రెమిడెసివిర్ మందులు ఇచ్చారు. ఫీవర్, కాస్త బాడీ పెయిన్స్ తప్ప తనకు ఎటువంటి ఇబ్బంది కలగలేదని నాగబాబు తెలియజేసారు. ఈ సందర్భంగా మెగా బ్రదర్ మాట్లాడుతూ.. కరోనాకు ఎవరు అతీతులు కారన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న అది వస్తుందని తెలిపారు. ఎవరికైన జ్వరం, కాస్త దగ్గు జలుబు ఉంటే వెంటనే కరోనా టెస్ట్ చేయంచుకోండని నాగబాబు తెలిపారు. కరోనాకు మందు లేనది.. వైరస్ లోడ్‌ను బట్టి.. ట్రీట్మెమెంట్ అందిస్తారని తెలిపారు. ఇక కరోనా వైరస్.. 14 రోజల తర్వాత దానంతట అదే చచ్చిపోతుందన్నారు. 14 రోజుల తర్వాత వైరస్ ఉన్న అది హాని చేయదన్నారు. త్వరలోనే తాను ప్లాస్మా దానం చేయనున్నట్టు తెలిపారు. ఇక నాగబాబు విషయానికొస్తే.. ఆయన నటుడిగా నిర్మాతగా, వ్యాఖ్యాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన ఓవైపు టీవీ షోలతో పాటు అడపా దడపా సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన తన కూతురు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: