Home /News /movies /

Varun Tej: వరుణ్ తేజ్ కెరీర్ కోసం నాగబాబు మాస్టర్ ప్లాన్.. అన్నయ్య చిరు హెల్ప్ తీసుకుంటున్న మెగా బ్రదర్..

Varun Tej: వరుణ్ తేజ్ కెరీర్ కోసం నాగబాబు మాస్టర్ ప్లాన్.. అన్నయ్య చిరు హెల్ప్ తీసుకుంటున్న మెగా బ్రదర్..

నాగబాబు, వరుణ్ తేజ్ (ఫైల్ పోటో)

నాగబాబు, వరుణ్ తేజ్ (ఫైల్ పోటో)

Varun Tej: వరుణ్ తేజ్ కెరీర్ కోసం నాగబాబు మాస్టర్ ప్లాన్.. అన్నయ్య చిరు హెల్ప్ తీసుకుంటున్న మెగా బ్రదర్.

    Varun Tej: వరుణ్ తేజ్ కెరీర్ కోసం నాగబాబు మాస్టర్ ప్లాన్.. అన్నయ్య చిరు హెల్ప్ తీసుకుంటున్న మెగా బ్రదర్. ప్రస్తుతం వరుణ్ తేజ్.. హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు తనదైన శైలిలో డిఫరెంట్ మూవీస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. కానీ నాగబాబు మాత్రం వరుణ్ తేజ్ కెరీర్ కోసం మరో మెగా ప్లాన్ రెడీ చేస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు అన్ని ఇండస్ట్రీస్‌లో రీమేక్ మూవీస్ ట్రెండ్ నడుస్తోంది. రీమేక్ అంటే వేరే భాషల్లో హిట్టైన సినిమాలను రీమేక్ చేయడం కాదు.. తెలుగు హిట్టైన పాత సూపర్ హిట్ సినిమాలను ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టు రీమేక్ చేయాలనే ఆలోచన పెరిగింది. ఇప్పటికే వరుణ్ తేజ్ కూడా పాత సినిమాలను రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే వరుణ్ తేజ్.. పనవ్ కళ్యాణ్ నటించిన ‘జానీ’ సినిమాతో పాటు చిరంజీవి హీరోగా నటించిన ఛాలెంజ్, కొదమ సింహం సినిమాలు వరుణ్ తేజ్ ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టు రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇక ఈ రెండు సినిమాల విషయానికొస్తే.. చిరు కెరీర్‌లో మంచి హిట్ సినిమాలుగా మిగిలాయి.

    అందులో ఛాలెంజ్ సినిమా విషయానికొస్తే.. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై కే.యస్.రామారావు నిర్మించారు. ఛాలెంజ్ విషయానికొస్తే.. మంచి తలుచుకుంటే ఏమైనా సాధించగలడనే దానికి ఈ సినిమా స్పూర్తిగా నిలించింది.  కొదమ సింహం విషయానికొస్తే.. ఈ చిత్రాన్ని కే.మురళీ మోహన్ రావు డైరెక్ట్ చేసారు.

    ఛాలెంజ్, కొదమ సింహం సినిమా రీమేక్‌లో వరుణ్‌ తేజ్ ? (File/Photos)


    ఈ రెండు సినిమాలు వరుణ్ తేజ్ ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టు వరుణ్ తేజ్ హీరోగా రీమేక్ చేస్తే బాగానే ఉంటుంది. అదే సమయంలో ఈ సినిమాలను వరుణ్ తేజ్ కాకపోయినా.. మిగతా మెగా హీరోలు.. ముఖ్యంగా రామ్ చరణ్ రీమేక్  చేస్తే ఆ ఇంపాక్టే వేరుగా ఉంటుందనే అభిప్రాయం మెగాభినుల్లో ఉంది. ఇప్పటికే ఈ సినిమా కథలపై కసరత్తు కూడా మొదలుపెట్టినట్టడట. మరోవైపు వీలైతే.. ఈ యేడాదే వరుణ్ తేజ్‌కు వివాహాం చేయాలనే ఆలోచనలో నాగబాబు ఉన్నాడట. ఇప్పటికే సంబంధాలు కూడా చూస్తున్నాడట.

    చిరంజీవి కెరీర్‌లో స్పెషల్‌గా నిలిచిన చాలెంజ్, కొదమ సింహం సినిమాలు (Facebook/Photos)


    మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో స్పెషల్ చిత్రాలుగా నిలిచిన ఈ రెండు వరుణ్ తేజ్ చేయడం పెద్ద సాహసమే అనే చెప్పాలి. ప్రస్తుతం వరుణ్ తేజ్.. ఓ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ‘గనీ’ సినిమాలో నటిస్తున్నారు. దాంతో పాటు ‘ఎఫ్ 2’ సీక్వెల్ ‘ఎఫ్ 3’ మూవీ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఈ ఇయర్ విడుదల కానున్నాయి.  దాంతో పాటు పలు చిత్రాలను లైన్‌లో పెట్టాడు వరుణ్ తేజ్. మొత్తంగా వరుణ్ తేజ్.. తనదైన శైలిలో సినిమాలు చేస్తున్న వరుణ్ తేజ్.. ఈ ఓల్డ్ సినిమాలను రీమేక్ చేసి ఇప్పటి జనరేషన్‌కు తగ్గట్టు హిట్స్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Chiranjeevi, Nagababu, Tollywood, Varun Tej

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు