హోమ్ /వార్తలు /సినిమా /

Naga babu: అల్లుడికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన నాగబాబు.. ఏంటో తెలుసా?

Naga babu: అల్లుడికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన నాగబాబు.. ఏంటో తెలుసా?

nagababu

nagababu

Naga babu: తెలుగు ఇండస్ట్రీలో మెగా కుటుంబం గురించి అందరికీ తెలిసిందే. ఈ కుటుంబం వెండితెరపై ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా ఈ కుటుంబం సోషల్ మీడియాలో కూడా తెగ యాక్టివ్ గా ఉంటుంది.

  Naga babu: తెలుగు ఇండస్ట్రీలో మెగా కుటుంబం గురించి అందరికీ తెలిసిందే. ఈ కుటుంబం వెండితెరపై ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా ఈ కుటుంబం సోషల్ మీడియాలో కూడా తెగ యాక్టివ్ గా ఉంటుంది. ఇదిలా ఉంటే తెలుగు సినీ నటుడు మెగా బ్రదర్ నాగబాబు గురించి అందరికీ తెలిసిందే. ఈయన సోషల్ మీడియాలో ఎంత బిజీగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాకుండా ముక్కుసూటి మనిషి గా అవతలి వాళ్ళ పై సెటైర్లు వేస్తూ యాక్టివ్ గా ఉంటాడు.

  ఇక ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నాగబాబు పంచుకోగా.. తన గారాల ప్రిన్సెస్ నిహారిక పెళ్లికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. గత ఏడాది డిసెంబర్ లో నిహారిక, జొన్నలగడ్డ చైతన్యల వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ పెళ్లి తమ కుటుంబ సమక్షంలో అంగరంగ వైభవంగా జరుగగా.. నాగబాబు తన అల్లుడిని సోషల్ మీడియా వేదికగా అభిమానులకు పరిచయం చేశాడు. ఇదిలా ఉంటే తాజాగా తన అల్లుడికి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

  తన కూతురు పెళ్లి తర్వాత.. సోషల్ మీడియాలో మరింత హైలెట్ గా మారిన నాగబాబు.. తాజాగా తన అల్లుడికి ఉగాది పండగ సందర్భంగా ఓ కారును బహుమతిగా ఇచ్చాడు. రేంజ్ రోవర్ డిస్కవర్ మోడల్ తెలుపు రంగులో ఉన్న కారు తన అల్లుడికి గిఫ్ట్ గా ఇవ్వగా.. దానికి సంబంధించిన ఫోటోలు నిహారిక తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. అంతేకాకుండా నాగబాబు కూడా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ విషయం గురించి తెలియజేస్తూ.. ఉగాదికి ఇవ్వాల్సిన కానుక కాస్త ఆలస్యం అయ్యిందని తెలిపాడు. ప్రస్తుతం నాగబాబు తన అల్లుడు, కూతురికి పూల గుత్తి ఇస్తూ కారు ఎదురుగా నిలిచిన ఫోటో వైరల్ గా మారింది.

  Published by:Navya Reddy
  First published:

  Tags: Chaithanya jonnalagadda, Mega brother nagababu, Mega Family, Niharika konidela, Tollywood hero

  ఉత్తమ కథలు