Nagababu: అన్నమాట నిలబెట్టుకున్నమెగా బ్రదర్ నాగబాబు..

Nagababu | మెగా బ్రదర్ నాగబాబు అన్న మాట నిలబెట్టుకున్నాడు. ఈ రోజుల్లో చెప్పిన మాటకు చేసే చేతలకు అసలు పొంతనే ఉండదు. ఇలాంటి సమయంలో నాగబాబు ఇచ్చిన మాటకు కట్టుబడి చేస్తానన్న పనిని చేసి చూపించాడు.  వివరాల్లోకి వెళితే.. 

news18-telugu
Updated: October 14, 2020, 6:11 PM IST
Nagababu: అన్నమాట నిలబెట్టుకున్నమెగా బ్రదర్ నాగబాబు..
నాగబాబు (Youtube/Credit)
  • Share this:
Nagababu | మెగా బ్రదర్ నాగబాబు అన్న మాట నిలబెట్టుకున్నాడు. ఈ రోజుల్లో చెప్పిన మాటకు చేసే చేతలకు అసలు పొంతనే ఉండదు. ఇలాంటి సమయంలో నాగబాబు ఇచ్చిన మాటకు కట్టుబడి చేస్తానన్న పనిని చేసి చూపించాడు.  వివరాల్లోకి వెళితే.. మెగా బ్రదర్ నాగబాబు రీసెంట్‌గా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే కదా. ఈ విషయాన్ని ఆయన సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు.  ఆ తర్వాత నాగబాబు కరోనా నుంచి కోలుకున్నట్టు అదే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పాటు ప్రేక్షకులకు తెలియజేసారు.అంతేకాదు హోం ఐసోలేషన్ తర్వాత తాను కరోనాతో ఎదుర్కొన్న అనుభవాలు, తీసుకున్న జాగ్రత్తలను వీడియో ద్వారా పంచుకున్నారు. ఈ సందర్భంగా తాను ఐదుసార్లు కరోనా టెస్టులు చేయించుకున్నట్టు తెలిపారు. నిహారిక ఎంగేజ్మెంట్‌ కోసం ముందుగా కరోనా టెస్ట్ చేయించుకున్నట్టు తెలిపారు. ఇక కరోనాను జయించిన తర్వాత ప్లాస్మాకు దానం చేస్తానని నాగబాబు తెలియజేసారు.

Mega Brother Nagababu Donates Plasma after Recover corona Virus,Nagababu, Nagababu donates plasma,nagababu donates plasma,agababu corona virus,Nagababu covid-19,news, Nagababu twitter, Nagababu Corona virus, Nagababu covid 19, Nagababu to donate plasma, నాగబాబు న్యూస్, నాగబాబు ట్విట్టర్, నాగబాబు కరోనా వైరస్, మెగాబ్రదర్ నాగబాబు,కరోనా జయించిన నాగబాబు,కరోనాను జయించిన నాగబాబు,ప్లాస్మాను డినేట్ చేసిన నాగబాబు,నాగబాబు ప్లాస్మా డొనేషన్
నాగబాబు ప్లాస్మా దానం (Nagababu/Photo)


అంతేకాదు.. ఈ రోజు చిరంజీవి బ్లడ్ బ్యాంకులో ప్లాస్మాను డొనేట్ చేసారు. అందుకు సంబంధించిన ఫోటోను అభిమానులతో షేర్ చేసుకున్నారు. మొత్తంగా నాగబాబుకు ఇచ్చిన మాటకు కట్టుబడి.. కరోనాతో పోరాడుతున్న పేషెంట్స్  కోసం ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావడం నిజంగా మంచి విషయమే. కరోనా సోకిన తర్వాత మెగా బ్రదర్ మాట్లాడుతూ.. కరోనాకు ఎవరు అతీతులు కాదన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న అది వస్తుందని తెలిపారు. ఎవరికైన జ్వరం, కాస్త దగ్గు జలుబు ఉంటే వెంటనే కరోనా టెస్ట్ చేయంచుకోండని నాగబాబు అప్పట్లో అభిమానులతో పాటు సామాన్య జనాలకు తెలిపారు. కరోనాకు మందు లేనది.. వైరస్ లోడ్‌ను బట్టి.. ట్రీట్మెమెంట్ అందిస్తారని తెలిపారు. ఇక కరోనా వైరస్.. 14 రోజల తర్వాత దానంతట అదే చచ్చిపోతుందన్నారు. 14 రోజుల తర్వాత వైరస్ ఉన్న అది హాని చేయదన్నారు. అంతేకాదు త్వరలో తాను ప్లాస్మా దానం చేయనున్నట్టు తెలిపిన ఈయన ఈ రోజు కోవిడ్ పేషెంట్స్ కోసం ప్లాస్మా దానం చేయడం విశేషం.
Published by: Kiran Kumar Thanjavur
First published: October 14, 2020, 6:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading