MEGA BROTHER NAGABABU CONGRATULATIONS TO Y S JAGANMOHAN REDDY TO HUGE VICTORY IN 2019 ANDHRA PRADESH ASSEMBLY ELECTIONS TA
జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన నాగబాబు.. మాది ఓటమి కాదు..విరామం మాత్రమే..
ఏపీ సీఎం జగన్,నాగబాబు
ఏపీ శాసనసభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైసీపీ అధినేత వై.యస్.జగన్మోహన్ రెడ్డిని సినీ నటుడు, జనసేన తరుపున నర్సాపురం ఎంపీగా పోటీచేసిన నాగబాబు శుభాకాంక్షలు తెలియజేసారు. మరోవైపు కార్యకర్తలు నిరాశ పడొద్దని చెప్పుకొచ్చారు. వివరాల్లోకి వెళితే..
ఏపీ శాసనసభ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైసీపీ అధినేత వై.యస్.జగన్మోహన్ రెడ్డిని సినీ నటుడు, జనసేన తరుపున నర్సాపురం ఎంపీగా పోటీచేసిన నాగబాబు శుభాకాంక్షలు తెలియజేసారు. గెలిచిన జగన్..ఏపీ ప్రజలకు సుపరిపాలన అందించాలని కోరారు. అంతేకాదు ఎన్నికల్లో ప్రజలకు జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. అంతేకాదు తమ సహకారం కూడా జగన్మోహన్ రెడ్డికి ఎపుడు ఉంటుందని చెప్పుకొచ్చారు. మరోవైపు జనసేన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ...తమ పార్టీ గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. క్లీన్ పాలిటిక్స్‌తో రాజకీయాల్లో వచ్చామన్నారు. తన సోదరుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన జనాలకు ఎలాంటి డబ్బులు పంచకుండా ముందుకు వచ్చారన్నారు. అంతేకాదు జనసేనకు కొన్ని లక్షల ఓట్లు వచ్చాయన్నారు. మరోవైపు లక్షలాది ప్రజలు డబ్బులు లేని రాజకీయాలు కోరుకున్నట్టు ఈ విషయంతో స్పష్టమైందన్నారు. ఇక మాకు ఓట్లు వేసిన ప్రజలు ఎలాంటి డబ్బులు ఆశించకుండా.. కేవలం పవన్ పై ఉన్న అభిమానం, ప్రేమతో రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొస్తారన్న నమ్మకంతో ప్రజలు ఓటేశారన్నారు. జనసేన ఎన్నికల్లో గెలవకపోయినా..నైతికంగా మాత్రం విజయం సాధించింద్నారు. ఖచ్చితంగా రాజకీయాల్లో కొనపాగుతూనే మంచి మార్పు తీసుకొస్తామన్నారు. గెలుపు కోసం ఎంతో అంకితభావంతో పనిచేసిన జన సైనికులంతా పార్టీ ఓటమితో బాధ పడొద్దని చెప్పుకొచ్చారు. ఈసారి ఓడిపోయినా.. నెక్ట్స్ ఎన్నికల వరకు అధైర్యపడకుండా ముందుకెళ్లాలని సూచించారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.