గాడ్సే ట్వీట్ పై మెగా బ్రదర్ నాగబాబు వివరణ..

నాగబాబు (Twitter/Nagababu)

మహాత్మ గాంధీని చంపిన నాథూరాం గాడ్సే జయంతి సందర్భంగా నాగబాబు చేసిన ట్వీట్ వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే కదా. తాజాగా నిన్న చేసిన ట్వీట్ పై నాగబాబు విరవణ ఇచ్చాడు.

  • Share this:
    మహాత్మ గాంధీని చంపిన నాథూరాం గాడ్సే జయంతి సందర్భంగా నాగబాబు చేసిన ట్వీట్ వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే కదా. ఆయన నిజమైన దేశ భక్తుడు అంటూ కొనియాడారు. అంతేకాదు గాంధీని చంపడం కరెక్టా కాదా అనేది పక్కన పెడితే.. ఆయన గాంధీని చంపక ముందు వరకు ఆయన ఎలాంటి నేరాలు చేయలేదు. ఆయన  వైపు వాదనను ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి పనిచేసింది.(ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే) 'గాంధీని చంపితే ఆపఖ్యాతి పాలవుతానని తెలిసినా తను అనుకున్నది చేశాడు. కానీ, నాథూరాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒక సారి గుర్తు చేసుకోవాలనిపించింది అంటూ ట్వీట్ చేసాడు.  పాపం నాథూరాం గాడ్సే. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్' అని తెలుగులో ఓ ట్వీట్ చేసాడు. అయితే నాగబాబు వ్యాఖ్యలపై కొందరు మండిపడితే.. మరికొందరు నిజమే కదా. గాంధీగారిని చంపినంత మాత్రానా ఆయన దేశభక్తిని శంకించలేము కదా అంటూ నాగబాబును వెనకేసుకొచ్చారు. మొత్తంగా ఆయన వ్యాఖ్యలపై ఎక్కువ మంది తప్పు పడుతున్నారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వ్యక్తిని చంపడం కరెక్ట్ ఎలా అవుతుందంటూ నాగబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


    దీనిపై నాగబాబు వివరణ ఇచ్చారు. నేను నాథూరామ్ గురించి చేసిన ట్వీట్ నాథూరాం చేసిన నేరాన్ని సమర్ధించలేదు. ఆయన వెర్షన్ కూడా జనాలకు తెలియాలి అని మాత్రమే అన్నాను. నాకు మహాత్మ గాంధీ అంటే ఎంతో గౌరవం ఉంది. నిజం చెప్పాలంటే నన్ను విమర్శించే వాల్ల కన్నా నాకు ఆయనంటే ఎనలేని గౌరవం అన్నారు. మొత్తానికి నాగబాబు.. నాథూరామ్ గాడ్సే చేసిన ట్వీట్ ఆయనకు కొత్త తలనొప్పులు తీసుకొచ్చింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: