నాగబాబు మరో ట్వీట్.. విశ్వాసం లేని కుక్క అంటూ..

నాగబాబు మరో ట్వీట్ (Twitter/Photo)

మెగా బ్రదర్ నాగబాబు..నటుడిగా కంటే యాంకర్‌గా ఎక్కువ పాపులర్ అయ్యాడు. అంతేకాదు ఈయన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా నాగబాబు విశ్వాసం లేని కుక్క అంటూ ఓ వీడియోను షేర్ చేసాడు.

 • Share this:
  మెగా బ్రదర్ నాగబాబు..నటుడిగా కంటే యాంకర్‌గా ఎక్కువ పాపులర్ అయ్యాడు. అంతేకాదు ఈయన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. అంతేకాదు ఎప్పటి కపుడు సినిమా, రాజకీయాలపై తనదైన శైలిలో వివాదాస్పద ట్వీట్స్ చేస్తూ ఉంటాడు. ఎపుడు ఎంతో అగ్రెసివ్‌గా ఉండే ఈ మధ్య కాస్త శాంతించినట్టు కనబడుతోంది. ఈ క్రమంలో ‘ నా ఛానెల్ నా ఇష్టం’ అనే యూట్యూబ్‌ ఛానెల్ పేరును ‘మన ఛానల్ మన ఇష్టం’ అంటూ పేరు మార్చేశారు. త్వరలోనే నాగబాబు అల్లు అరవింద్‌కు చెందిన ‘ఆహా’ ఫ్లాట్‌ఫామ్‌లో ‘విజిల్’ అనే స్టాండప్ కామెడీ షోతో పలువురు కొత్తవాళ్లకు పరిచయం చేయనున్నాడు.తాజాగా నాగబాబు తన ఇంట్లో జరిగిన ఓ ఆసక్తికరమైన సన్నివేశం ఉన్న వీడియోను అభిమానులతో పంచుకునక్నాడు. అంతేకాదు తను పరిచయం చేసే వీడియోకు ‘విశ్వాసం లేని కుక్క’ అంటూ టైటిల్ పెట్టడంతో నాగబాబు మరోసారి ఎవరినైనా టార్గెట్ చేసారా అని అందరు అనుకున్నారు. కానీ నాగబాబు ఓ ఫన్నీ వీడియోను అభిమానులతో పంచుకున్నారు.


  కాగా నాగబాబు ఈ వీడియోలో జంతువులన్నింటిలో కుక్కకు మనుషులకు ప్రత్యేక అనుబంధం ఉంది. నాకు కూడా చిన్నప్పటి నుంచి కుక్కుల అంటే ఇష్టం. మా ఇంట్లో పీకూ అనే కుక్క ఉంది. 2016 నుంచి మాతోనే ఉంటుంది. అది మా ఇంటికి ఎవరైనా వచ్చినా.. నా మీదికి ఎవరైనా వచ్చినా అంతేత్తున వచ్చిన వాళ్లపై ఎగబడుతుంది. నేను కూడా  ఆ కుక్క మాకు ఎవవరైనా అపకారం చేయడానికి ఎగబడితే.. మమ్మల్ని రక్షిస్తుందని అనుకున్నాం. మనం కూడా ఎన్నో కుక్కలను చూస్తూ ఉంటాం. యజమానిని కాపాడిని కుక్క.. యజమానిని కాపాడటంలో ప్రాణాలు కోల్పోయిన శునకం అంటూ డాగ్స్ గురించి ఎన్నో సాహస గాథలు వింటూ ఉంటాం. మా పీకూ కూడా అలాంటిదే అనుకున్నాం. కానీ అది చేసిన పనిని చూసి మేము అవాక్కయ్యాం. మా ఆవిడకు పాములంటే భయం అనడంతో .. ఆ భయం పోగట్టడానికి మొన్న రబ్బరు పాములు తీసుకొచ్చి ..తనతో పట్టించా అని చెబుతూ.. పాముని చూడగానే నాగబాబు భార్య పద్మతో పాటు ఆ కుక్క కూడా లోపలకి పారిపోయే ఫన్ని క్లిప్సింగ్ చూపించాడు నాగబాబు.

  నాగబాబు కొత్త ప్రోగ్రామ్ విజిల్ (Twitter/Photo)


  ఈ సన్నివేశం చూడగానే నాకు ఏం అనిపించింది అంటే.. ఆ కుక్క ప్రాణాలు మనం కాపడాలేమో.. ఆ పామును చూసి తన శునకం తన ప్రాణాలు తనకు ముఖ్యమంటూ పారిపోయిందంటూ చెప్పాడు. ఈ తతంగం అంతా చూసాకా నాకు అర్ధమైంది ఏమిటంటే మా పీకూకు కూడా మనిషి లక్షణాలు బాగా ఉన్నాయనిపించిందంటూ ఆ ఫన్నీ వీడియోను షేర్ చేస్తూ తాను కూడా ఓ నవ్వు నవ్వాడు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: