దేనికైనా రాసి పెట్టుండాలి.. మెగా బ్రదర్ నాగబాబును అలా వెంటాడిన దురదృష్టం..

నాగబాబు (Twitter/nagababu)

దేనికైనా రాసి పెట్టుండాలి. అలా లేకపోవడం వల్లే నాగబాబును దురదృష్టం వెంటాడింది. వివరాల్లోకి వెళితే.. 

  • Share this:
    దేనికైనా రాసి పెట్టుండాలి. అలా లేకపోవడం వల్లే నాగబాబును దురదృష్టం వెంటాడింది. వివరాల్లోకి వెళితే..నాగేంద్ర బాబు ఉరఫ్ నాగబాబు చిరంజీవి తమ్ముడిగానే కాకుండా.. నిర్మాతగా, నటుడిగా, టీవీ యాంకర్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు అన్నయ్య చిరంజీవి సహకారంతో నిర్మాతగా అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించి పలు చిత్రాలను కూడా నిర్మించాడు. అన్నయ్య చిరంజీవితో ఐదు చిత్రాలను నిర్మిస్తే.. ఒకే ఒక్క ‘బావగారూ.. బాగున్నారా’ సినిమా మాత్రమే హిట్టు అనిపించుకుంది. అటు తమ్ముడు పవన్ కళ్యాణ్‌తో నిర్మించిన ‘గుడుంబా శంకర్’.. రామ్  చరణ్‌తో నిర్మించిన ‘ఆరెంజ్’ సినిమా కూడా నిర్మాతగా నాగబాబుకు సక్సెస్ అందించలేకపోయాయి. మొత్తంగా తన ఇంట్లో ఇండస్ట్రీని శాసించే హీరోలున్న వాళ్లతో హిట్ చిత్రాలను నిర్మించలేకపోవడం నిజంగానే నాగబాబు దురదృష్టమనే చెప్పాలి. ఒకానొక సమయంలో రామ్ చరణ్‌తో నిర్మించిన ‘ఆరెంజ్’ సినిమా కారణంగా నాగబాబు అప్పులపాలయ్యాడు. ఒక దశలో ఆత్మహత్య చేసుకుందామనుకునట్టు ఓ సందర్భంలో నాగబాబు చెప్పిన  సంగతి తెలిసిందే కదా. ఆ సమయంలో నాగబాబును ఆదుకోవడానికి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆర్ధికంగా సాయం చేసాడనే వార్తలు కూడా వచ్చాయి.

    Will Nagababu sacrifices his Jabardasth career for his Brother Pawan Kalyan and Janasena Party future pk ఏమో ఇప్పుడు ఇదే వార్తలే వినిపిస్తున్నాయి ఇండస్ట్రీలో. నిజంగానే నాగబాబు తన తమ్ముడి కోసం త్యాగం చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ఈయన జబర్దస్త్ కెరీర్ కూడా దీనికోసమే పణంగా పెట్టారని టాక్ వినిపిస్తుంది. naga babu,naga babu political future,naga babu jabardasth comedy show,naga babu extra jabardasth comedy show,naga babu twitter,naga babu facebook,naga babu pawan kalyan,naga babu janasena,naga babu janasena review meeting,naga babu janasena review meeting vijayawada,pawan kalyan janasena review meeting,janasena defeat,janasena review meetings,telugu cinema,pawan kalyan naga babu comments,nagababu,ys jagan mohan reddy,nagababu ap cm ys jagan mohan reddy,jabardasth comedy show,jabardasth nagababu,nagababu pawan kalyan janasena,pawan kalyan,ap assembly elections 2019,ap news,ap elections,ap politics,janasena party,janasena,జనసేన అధినేత,పవన్ కల్యాణ్,జనసేన పార్టీ,నాగబాబు,పవన్ కల్యాణ్ ఓటమి,ఏపీ రాజకీయాలు,ఏపీ న్యూస్,జనసేన,వైయస్ జగన్ మోహన్ రెడ్డి,వైయ్ జగన్ నాగబాబు,పవన్ కళ్యాణ్ నాగబాబు,నాగబాబు పవన్ కళ్యాణ్,నాగబాబు జనసేన రివ్యూ మీటింగ్,జనసేన రివ్యూ మీటింగ్ పవన్ కళ్యాణ్,తెలుగు సినిమా,
    పవన్ కళ్యాణ్ నాగబాబు ఫైల్ ఫోటో (Source: Twitter)


    అయితే అప్పట్లో నిర్మాతగా అన్నయ్య నాగబాబును ఆదుకోవడానికి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి హరీష్ శంకర్ దర్శకత్వంలో గబ్బర్ సింగ్ సినిమాను నిర్మించే ఛాన్స్ ఇచ్చాడట. అయితే అప్పటికే ఆర్థికంగా చితికిపోయిన నాగబాబు ఈ సినిమా కనుక తేడా కొడితే ఉన్న ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతో ఈ సినిమా స్టార్ట్ అయ్యే సమయానికి ఈ సినిమా నిర్మాణ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకున్నాడు. పైగా అప్పటికే పవన్ కళ్యాణ్ వరుస పరాజయాలతో ఉన్నాడు. అందుకే నాగబాబు ఈ సినిమాను నిర్మించే సాహసం చేయలేకపోయాడు.

    గబ్బర్ సింగ్ సినిమాకు 8 ఏళ్లు (gabbar singh 8 years )
    గబ్బర్ సింగ్ సినిమాకు 8 ఏళ్లు (gabbar singh 8 years )


    దాంతో తనతో అప్పటికే ‘తీన్‌మార్’ సినిమాను నిర్మించి లాస్ అయిన బండ్ల గణేష్‌కు మరోసారి గబ్బర్ సింగ్ సినిమా నిర్మించే ఛాన్స్ ఇచ్చాడు పవన్. అప్పటికే పవర్ స్టార్  బండ్ల గణేష్‌తో మరో సినిమా తీస్తానని మాట కూడా ఇచ్చాడట. ఆ మాట ప్రకారం గబ్బర్ సింగ్ నిర్మాణ బాధ్యతలను బండ్ల గణేష్‌కు అప్పగించాడు.  పైగా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన గబ్బర్ సింగ్ ఆ తర్వాత వసూళ్ల వర్షం కురిపించి నిర్మాతగా బండ్ల గణేష్‌ పేరు మారుమోగేలా చేసింది. ఈ సినిమా తర్వాత బండ్ల గణేష్ టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అయ్యాడు. ఒక వేళ ఈ సినిమాను నాగబాబు నిర్మించినట్టైయితే.. నిర్మాతగా మెగా బ్రద్ మంచి లాభాలు గడించేవాడు. ఈ విధంగా  గబ్బర్ సింగ్ రూపంలో  నాగబాబును మరోసారి దురదృష్టం వెంటాడింది. అందుకే అదృష్టం, దురదృష్టం ఎపుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పడం కాస్త కష్టమనే చెప్పాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: