Naga Babu: నాగబాబుకు కరోనా పాజిటివ్.. అసలు నిజమెంత..?

Naga Babu (నాగబాబు)

Naga Babu: కరోనా వైరస్ ప్రస్తుతం ఎవర్నీ వదలడం లేదు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరికీ వైరస్ వచ్చేస్తుంది. ఇంటింటికి కరోనా అన్నట్లుంది ఇప్పుడు పరిస్థితి.

  • Share this:
కరోనా వైరస్ ప్రస్తుతం ఎవర్నీ వదలడం లేదు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరికీ వైరస్ వచ్చేస్తుంది. ఇంటింటికి కరోనా అన్నట్లుంది ఇప్పుడు పరిస్థితి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఈ వైరస్ వ్యాప్తి అరికట్టలేకపోతున్నారు. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో కూడా చాలా మంది కరోనా బారిన పడ్డారు. తెలుగు ఇండస్ట్రీలో కూడా బండ్ల గణేష్, రాజమౌళి సహా చాలా మంది ప్రముఖులు ఇప్పటికే కరోనాతో పోరాడి విజయం సాధించారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం సైతం నెల రోజుల తర్వాత కరోనా నెగిటివ్ తెచ్చుకున్నారు.
నాగబాబు (Twitter/nagababu)
నాగబాబు (Twitter/Nagababu)

ఇదిలా ఉంటే మెగా బ్రదర్ నాగబాబుకు కూడా కరోనా పాజిటివ్ అని తేలినట్లు వార్తలు వస్తున్నాయి. కరోనా లక్షణాలు కనిపించడంతో నాగబాబు టెస్ట్ చేయించుకున్నారు. అందులో పాజిటివ్ అని తేలడంతో ప్రస్తుతం నాగబాబు హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నాడని సన్నిహితుల నుంచి వస్తున్న సమాచారం. తనను కలిసిన వాళ్లందరూ కూడా టెస్టులు చేయించుకోవాలని ఆయన సూచించినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ మధ్యే ఓ షో చేస్తున్నాడు నాగబాబు.
నిహారిక నాగబాబు (naga babu niharika)
నిహారిక నాగబాబు (naga babu niharika)

దాంతో పాటు తన యూట్యూబ్ ఛానెల్‌లో కూడా ఓ షో చేస్తున్నాడు. అంతేకాదు అతను తన కుమార్తె నిహారికతో కలిసి ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూ కూడా చేసాడు నాగబాబు. ఈ షూటింగ్ సమయంలోనే ఈయనకు కరోనా అటాక్ అయిందని తెలుస్తుంది. లక్షణాలు స్వల్పంగానే ఉండటంతో క్వారంటైన్‌లోకి వెళ్లిపోయాడు నాగబాబు. ఈయనతో పాటు మరికొందరు కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు తెలుస్తుంది.
Published by:Praveen Kumar Vadla
First published: