రక్తం తాగుతున్నారు.. నిప్పులు చెరిగిన మెగా బ్రదర్ నాగబాబు..

నాగబాబు (Twitter/Nagababu)

Naga Babu: టాలీవుడ్‌లో ఇప్పుడు ఒకే ఒక్క ఇష్యూ బాగా బలంగా వినిపిస్తుంది. అదే విజయ్ దేవరకొండ ఫేక్ న్యూస్.. కొన్ని వెబ్‌సైట్‌లపై చేసిన కామెంట్స్. తనపై చేసిన ఆరోపణలకు..

  • Share this:
టాలీవుడ్‌లో ఇప్పుడు ఒకే ఒక్క ఇష్యూ బాగా బలంగా వినిపిస్తుంది. అదే విజయ్ దేవరకొండ ఫేక్ న్యూస్.. కొన్ని వెబ్‌సైట్‌లపై చేసిన కామెంట్స్. తనపై చేసిన ఆరోపణలకు వివరణ ఇస్తూ చాలా సీరియస్ అయ్యాడు విజయ్. అంతేకాదు వాళ్ల అంతు చూడాలని పిలుపునిచ్చాడు. దీనికి ఇండస్ట్రీ నుంచి కూడా ఊహించని స్పందన వస్తుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా ముందుకొచ్చి విజయ్‌కు సపోర్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నాగబాబు కూడా ఈ విషయంపై మాట్లాడాడు. తనదైన శైలిలో రెచ్చిపోయాడు మెగా బ్రదర్. ముఖ్యంగా చాలా మంది కంటే ఎక్కువగా రియాక్ట్ అయ్యాడు నాగబాబు.

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)


పెద్ద పెద్ద పదాలు వాడేస్తూ ట్వీట్ చేసాడు ఈయన. విజయ్ దేవరకొండ ట్వీట్ చూసి.. ఆయనకు సపోర్టుగా నిలుస్తున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు నాగబాబు. అంతేకాదు.. విజయ్ దేవరకొండకు పూర్తి మద్దతు తెలుపుతున్నాను.. ఇలాంటి వెబ్ సైట్లపై స్పందించడంలో ఇప్పటికే సినీ పరిశ్రమ చాలా ఆలస్యం చేసిందని.. సినీ పరిశ్రమ రక్తాన్ని వాళ్లు జలగల్లా పీల్చేస్తున్నారు.. నీ ప్రతిస్పందనకు థ్యాంక్స్.

విజయ్ దేవరకొండకు మద్దతుగా నాగబాబు ట్వీట్
విజయ్ దేవరకొండకు మద్దతుగా నాగబాబు ట్వీట్


ఈ వెబ్ సైట్లపై చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ నిప్పులు చెరిగాడు నాగబాబు. మరోవైపు విజయ్ దేవరకొండ కూడా తను పెట్టిన పోస్ట్ చూసి రిప్లై ఇచ్చిన ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్‌తో పాటు యాక్షన్ ప్లాన్ గురించి కూడా చెప్తున్నాడు. కచ్చితంగా ఫేక్ గాళ్ల పని పట్టాలని ఆయన కూడా సీరియస్ అవుతున్నాడు. మరి ఈ వేడి ఇండస్ట్రీలో ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో చూడాలిక.
Published by:Praveen Kumar Vadla
First published: