Naga Babu : నాగబాబు.. నటుడిగా, నిర్మాతగా.. అంతకుమించి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తమ్ముడిగా.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నగా ఒకప్పుడు ‘జబర్దస్త్’ కామెడీషో జడ్జిగా ఎంతోమందికి చేరువయ్యారు. ఇక నటుడిగా నాగబాబు విషయానికొస్తే... చిరంజీవి హీరోగా ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాక్షసుడు’ సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేసాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోగా నటించినా.. లక్ కలిసిరాదు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టీవీ తెరపై తనదైన శైలిలో రాణించారు. అప్పట్లో అన్నయ్య స్థాపించిన ప్రజా రాజ్యం(Praja Rajyam)లో ఈయన క్రియా శీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత తమ్ముడు జనసేన (Jana Sena) పార్టీలో చేరి నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం తమ్ముడికి రాజకీయంగా అండగా నిలుస్తున్నారు.
తాజాగా ఈయన అన్నయ్య చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ పై స్పందించారు. సినిమాల్లోంచి రాజకీయాల్లో వచ్చి ప్రజారాజ్యం తరుపున 18 ఎమ్మెల్యే సీట్లు గెలిచిన చిరంజీవి.. ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసారు. ఆపై కాంగ్రెస్ తరుపున రాజ్యసభకు ఎంపికై అప్పటి మన్మోహన్ సింగ్ క్యాబినేట్‌లో కేంద్ర పర్యాటక శాఖ (స్వతంత్య్ర) మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2014లో ఏపీ కాంగ్రెస్ తరుపున స్టార్ క్యాంపెనర్‌గా ప్రచారం చేసిన ఒక్క సీటు కూడా గెలవలేదు. తాజాగా చిరంజీవి ఇకపై సినిమాలతోనే ట్రావెల్ అవుతారు. ఆయన ఇక ఏ రాజకీయ పార్టీల్లో చేరరు అంటూ క్లారిటీ ఇచ్చారు. అక్కడే ఆయనకు మనశ్శాంతిగా ఉంటోందన్నారు. ఈయన రాజకీయాల్లో వచ్చే ఆలోచనే లేదన్నారు. ఆయన్ని రమ్నని కూడా కోరమన్నారు.
నాగబాబు అన్నయ్య చిరంజీవి అండదండలతో తల్లి అంజనా దేవి పేరు మీద అంజనా ప్రొడక్షన్స్ స్థాపించి..మొదటి సినిమాగా ‘రుద్రవీణ’ సినిమాను తెరకెక్కించాడు. కే.బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి పేరు వచ్చినా.. కమర్షియల్‌గా విజయవంతం కాలేదు. ఆ తర్వాత ‘త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్లు, బావగారు..బాగున్నారా’ వంటి సినిమాలు తెరకెక్కాయి.ఇందులో బావగారు బాగున్నారా మాత్రం కాస్తా పర్వాలేదనిపించింది. మరోవైపు తమ్ముడు పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘గుడుంబా శంకర్’, రామ్ చరణ్‌తో చేసిన ‘ఆరెంజ్’ సినిమాలు కూడా నిర్మాతగా నాగబాబును కోలుకోలేని విధంగా దెబ్బతీసాయి. ఇంట్లో మెగా హిట్టు ఇచ్చే హీరోలు ఉన్న వారితో హిట్ సినిమాలు నిర్మించలేకపోవడం నాగబాబు దురదృష్టమనే చెప్పాలి.
Shah Rukh Khan : మెగా హీరో టైటిల్‌తో వస్తోన్న షారుఖ్ ఖాన్.. అధికారిక ప్రకటన..
ఈ దెబ్బలతో నాగబాబు సినిమా నిర్మాణానికి దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’కు సమర్పకుడిగా వ్యవహరించిన అది కూడా బాక్సాఫీస్ దగ్గర చతికిలబడింది. నిర్మాతగా సక్సెస్ కాలేకపోవడంతో అన్నయ్య చిరంజీవితో పాటు వేరే హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్నాడు. ఏ విషయంలో నైనా తనకు అన్న చిరంజీవి స్ఫూర్తి అని చెబుతుంటారు నాగబాబు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chirnajeevi, Janasena, Naga Babu Konidela, Tollywood