నాగబాబు మేకప్, విగ్గు లేకపోతే ఎలా ఉంటాడో చూస్తారా..?

విగ్గు మేకప్ లేకుండా నాగబాబు (naga babu without make up)

Naga Babu: ఈ మధ్య మెగా బ్రదర్ నాగబాబు చాలా మారిపోయాడు. బరువు తగ్గిపోయి పూర్తిగా మేకోవర్ అయిపోయాడు. అసలు నాగబాబును చూసి ఫ్యాన్స్ కూడా పరేషాన్ అవుతున్నారు.

  • Share this:
ఈ మధ్య మెగా బ్రదర్ నాగబాబు చాలా మారిపోయాడు. బరువు తగ్గిపోయి పూర్తిగా మేకోవర్ అయిపోయాడు. అసలు నాగబాబును చూసి ఫ్యాన్స్ కూడా పరేషాన్ అవుతున్నారు. ఈయనేంటి ఇంతగా మారిపోయాడు అంటూ షాక్ అవుతున్నారు. అయితే ఈ మధ్య ఎప్పుడు బయటికి వచ్చినా కూడా పూర్తిగా విగ్గుతోనే వస్తున్నాడు నాగబాబు. ఆయన్ని ఒరిజినల్ గెటప్‌లో చూసి చాలా రోజులు అవుతుంది. బయటికి కూడా ఎక్కడా రావడం లేదు ఈయన. విగ్గు లేకపోయినా పూర్తిగా మేకప్ వేసుకుని కనిపిస్తుంటాడు నాగబాబు. అయితే లాక్ డౌన్ పుణ్యమా అని ఆయన ఒరిజినల్ గెటప్ ఇప్పుడు తెలుస్తుంది.
విగ్గు మేకప్ లేకుండా నాగబాబు (naga babu without make up)
విగ్గు మేకప్ లేకుండా నాగబాబు (naga babu without make up)

లాక్ డౌన్ రోజుల్లో ఆయన జబర్దస్త్ కమెడియన్లతో పాటు యాంకర్ రవి లాంటి వాళ్లకు ఫోన్స్ చేసి మాట్లాడుతున్నాడు. అన్ని విషయాలు తెలుసుకుంటున్నాడు. అప్పుడు నాగబాబు గెటప్ చూసి అంతా షాక్ అవుతున్నారు. ఆయన్ని చూసి సర్ ఏంటి ఇలా అయిపోయారు అంటూ అడుగుతున్నారు. మీసాలు, గడ్డం తీసేసి కొత్తగా కనిపిస్తున్నాడు నాగబాబు. మేకప్, విగ్గు కూడా లేకపోవడంతో వయసు కూడా నాగబాబుకు వయసు కూడా కనిపిస్తుంది.
విగ్గు మేకప్ లేకుండా నాగబాబు (naga babu without make up)
విగ్గు మేకప్ లేకుండా నాగబాబు (naga babu without make up)

చాలా రోజుల తర్వాత విగ్గు లేకుండా కనిపించడంతో ఫ్యాన్స్ కూడా ఒరిజినల్ రూపం చూసి పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం బుల్లితెరపై బిజీగా ఉంటూనే సినిమాల కోసం చూస్తున్నాడు నాగబాబు. ఆ మధ్య కావాలనే మేకోవర్ అయిపోయాడు ఈయన. బరువు తగ్గిపోయి స్లిమ్ లుక్‌తో షాక్ ఇచ్చిన నాగబాబు.. ఇప్పుడు ఒరిజినల్ గెటప్‌తో మరోసారి షాక్ ఇస్తున్నాడు.
Published by:Praveen Kumar Vadla
First published: