ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా ముచ్చట్లు బయటపెట్టిన నాగబాబు..

నాగబాబు,పవన్ కళ్యాణ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగా వేచి చూస్తున్నార‌నేది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న ఎప్పుడెప్పుడు వెండితెర‌పై క‌నిపిస్తాడా అని ఆస‌క్తిగా చూస్తున్నారు..

  • Share this:
పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగా వేచి చూస్తున్నార‌నేది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న ఎప్పుడెప్పుడు వెండితెర‌పై క‌నిపిస్తాడా అని ఆస‌క్తిగా చూస్తున్నారు అభిమానులు. ఆయ‌న సినిమాల కోసం క‌ళ్ళు కాయ‌లు కాచేలా చూస్తున్నారు. అన్నీ బాగుండుంటే ఈ పాటికే ప‌వ‌న్ సినిమా రావ‌డానికి అంతా సిద్ధ‌మై ఉండేది. కానీ ఏం చేస్తాం.. మాయ‌దారి క‌రోనా వ‌చ్చి అంతా పాడు చేసింది. ఇప్ప‌టికే పింక్ సినిమా రీమేక్ వ‌కీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి వ‌చ్చేది. కానీ అలా జ‌ర‌గలేదు.. ఈ సినిమా ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. మ‌రో షెడ్యూల్ పూర్తైతే కానీ ప‌వ‌న్ సినిమా రాదు.

వకీల్ సాబ్‌గా పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ (Twitter/Photo)c
వకీల్ సాబ్‌గా పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ (Twitter/Photo)c


ఇప్పుడు ఈ సినిమాపై నాగ‌బాబు ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసాడు. పింక్ సినిమాపై ముందు నుంచి కూడా ప‌వ‌న్ చాలా ఆస‌క్తి చూపించాడ‌ని.. ఆ సినిమా రీమేక్ చేయాల‌నుంద‌ని ఒక‌ట్రెండు సార్లు త‌న‌కు చెప్పాడ‌ని అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టాడు మెగా బ్ర‌ద‌ర్. అంతేకాదు.. పింక్ రెండు భాష‌ల‌తో పోలిస్తే క‌చ్చితంగా తెలుగులో మ‌రో 10 శాతం బెట‌ర్ మెంట్ చేసార‌ని చెబుతున్నాడు నాగ‌బాబు. తెలుగులో ప‌వ‌న్ అభిమానుల కోసం కొన్ని మార్పులు అయితే చేసార‌ని చెప్తున్నాడు నాగ‌బాబు.

పవన్ కళ్యాణ్ కొత్త లుక్ (Twitter/Pjhoto)
పవన్ కళ్యాణ్ కొత్త లుక్ (Twitter/Pjhoto)


అంతేకాదు.. క్రిష్ సినిమా గురించి కూడా కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు బ‌య‌ట‌పెట్టాడు నాగ‌బాబు. ముఖ్యంగా ఈ సినిమాలో ప‌వ‌న్ మొగ‌లాయిల క‌థ చేస్తున్నాడ‌ని అస‌లు విష‌యం చెప్పాడు ఈయ‌న‌. ఇది మొగలాయిల కాలం నాటి కథ అని.. సినిమా అంతా కోహినూర్ వజ్రం చుట్టూ కథ నడుస్తుందని తాను విన్నానని.. అది చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించిందని చెప్పాడు నాగ‌బాబు.
పవన్ కళ్యాణ్ (twitter/Pawan Kalyan)
పవన్ కళ్యాణ్ (twitter/Pawan Kalyan)

అంతేకాదు.. ఈ క‌థ‌ను క్రిష్ కూడా పవన్‌కు స‌రిపోయేలా రెడీ చేస్తున్నాడ‌ని చెప్పాడు. ఈ రెండు సినిమాలు త‌ప్ప‌కుండా ప‌వ‌న్ అభిమానుల‌కు ట్రీట్ ఇవ్వ‌డం ఖాయం అంటున్నాడు మెగా బ్ర‌ద‌ర్. ఈయ‌న చెప్పిన త‌ర్వాత సినిమాల‌పై అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగిపోయాయి. ఇందులో వ‌కీల్ సాబ్ 2020లో విడుద‌ల కానుంది కానీ క్రిష్ సినిమా మాత్రం 2021లో విడుద‌ల కానుందని తెలుస్తుంది. ఏఎం ర‌త్నం ఈ సినిమాను 100 కోట్ల‌తో నిర్మిస్తున్నాడు.
Published by:Praveen Kumar Vadla
First published: