నిహారిక, వరుణ్ తేజ్ పెళ్లిళ్ళపై క్లారిటీ ఇచ్చిన నాగబాబు..

వరుణ్ తేజ్ నిహారిక (varun tej niharika)

Niharika Marriage: త‌న కుటుంబంలో ఇప్పుడు రెండు పెళ్లిళ్ళు బాకీ ఉన్నాయంటున్నాడు నాగబాబు. ఒక‌టి కొడుకు వ‌రుణ్ తేజ్ అయితే మ‌రోటి కూతురు నిహారికది.

  • Share this:
ఈ మ‌ధ్య కాలంలో వ‌ర‌స‌గా వివాదాల‌తోనే ఎక్కువ‌గా వార్త‌ల్లో ఉన్నాడు నాగ‌బాబు. ఈయ‌న మాట్లాడితే చాలు కాంట్ర‌వ‌ర్సీలు ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చేస్తున్నాయి. యూ ట్యూబ్ ఛానెల్లో ఎప్పుడు ఎవర్ని టార్గెట్ చేస్తాడో అర్థం కావడం లేదు. ఇలాంటి స‌మ‌యంలో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు చెప్పాడు మెగా బ్ర‌ద‌ర్. త‌న కుటుంబంలో ఇప్పుడు రెండు పెళ్లిళ్ళు బాకీ ఉన్నాయంటున్నాడు ఈయ‌న‌. ఒక‌టి కొడుకు వ‌రుణ్ తేజ్ అయితే మ‌రోటి కూతురు నిహారికది. ఇప్పుడు ఒకేసారి తన కూతురు, కొడుకు పెళ్లిళ్ళపై క్లారిటీ ఇచ్చాడు నాగబాబు. వ‌రుణ్ పెళ్లి గురించి ఇప్పుడు క్లారిటీ ఇచ్చాడు ఈయ‌న‌.

నాగబాబు వరుణ్ తేజ్ (naga babu varun)
నాగబాబు వరుణ్ తేజ్ (naga babu varun)


చాలా రోజుల నుంచి తాను వ‌రుణ్ తేజ్‌కు పెళ్లి చేసుకోవాల‌ని చెబుతున్న‌ట్లు చెప్పాడు ఈ న‌టుడు. అయితే ఇప్పుడు జీవితంలో సెటిల్ కాకుండా పెళ్లి చేసుకోవ‌డం క‌ష్టం.. ఇంకా సెటిల్ అవ్వాలి.. సంపాదించాలంటూ ఈ త‌రం కుర్రాళ్లంతా చెబుతున్న‌ట్లే చెప్తున్నాడ‌ని చెప్పాడు నాగ‌బాబు. పైగా త‌న‌కంటే ఎక్కువ‌గా సంపాదిస్తున్నాడు కదా.. ఇప్పుడు మాట కూడా విన‌డం లేదంటూ చ‌మత్క‌రించాడు మెగా బ్ర‌ద‌ర్. వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం బాక్సర్ సినిమాతో పాటు మరో రెండు మూడు సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చాడు.

వరుణ్ తేజ్ (Photo/ Varun Tej Twitter)
వరుణ్ తేజ్ (Photo/ Varun Tej Twitter)


ఈయ‌న పెళ్లితో పాటు నిహారిక పెళ్లిపై కూడా స్పందించాడు నాగ‌బాబు. అస‌లే ఆ మ‌ధ్య సాయి ధ‌ర‌మ్ తేజ్, నిహారిక పెళ్లి చేసుకుంటున్నారనే వార్త‌లు వ‌చ్చాయి కానీ అవి అబ‌ద్ధ‌మ‌ని వాళ్లే తేల్చేసారు. ఇదిలా ఉంటే ఇప్పుడు నాగ‌బాబు కూడా నిహారిక పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు. 2021 ప్రథమార్థంలోనే నిహారిక పెళ్లి చేస్తామని చెప్పాడు ఈయన. మంచి సంబంధం కోసం చూస్తున్నామని.. వరుడు దొరగ్గానే పెళ్లి చేస్తామని చెప్పాడు ఈయన. నిహా సినిమాల్లోకి వ‌చ్చేట‌ప్పుడే అవ‌స‌ర‌మా అని అడిగాన‌ని.. క‌చ్చితంగా న‌టిస్తాన‌ని మొండికేయ‌డంతో కాద‌న‌లేక‌పోయానంటున్నాడు మెగా బ్ర‌ద‌ర్.
నాగబాబు నిహారిక (Niharika Naga Babu)
నాగబాబు నిహారిక (Niharika Naga Babu)

వెబ్ సిరీస్‌ల‌లో న‌టిస్తుంటే ఓకే చెప్పానంటున్నాడు నాగ‌బాబు. మరో ఏడాదిలో పెళ్లి చేస్తాన‌ని ముందే నిహారిక‌కు చెప్పాన‌ని క్లారిటీ ఇచ్చాడు నాగ‌బాబు. ఇప్పుడు మ‌రో ఏడాది టైమ్ అడుగుతుంద‌ని.. ఆ లోపు న‌చ్చిన ప‌నులు పూర్తి చేస్తాన‌ని చెప్పిందంటున్నాడు నాగ‌బాబు. ఆ టైమ్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో మంచి కుర్రాన్ని వెతికే ప‌నిలో ఉన్నాడు ఈయ‌న‌. త‌మకు కులం ప‌ట్టింపులు లేవ‌ని.. మంచి వాడైతే చాలంటున్నాడు నాగ‌బాబు. మరోవైపు వరుణ్ తేజ్ పెళ్లి కూడా 2021 చివర్లో కానీ.. లేదంటే 2022 మొదట్లో కానీ చేస్తామంటున్నాడు మెగా బ్రదర్. పిల్లల పెళ్లిళ్లు అయిపోతే తాను ఫ్రీ అయిపోతానంటున్నాడు ఈయన.
Published by:Praveen Kumar Vadla
First published: