Naga Babu: మీకు దమ్ముందా.. సత్తా ఉందా.. నాగబాబు కొత్త ఛాలెంజ్..

నాగబాబు (Nagababu)

Naga Babu: మెగా బ్రదర్ నాగబాబు లాక్‌డౌన్ తర్వాత బిజీ అయిపోయాడు. కరోనా వైరస్ కారణంగా చాలా రోజుల పాటు ఇంట్లోనే ఉండి తన ఛానెల్‌లో వరస వీడియోలు చేసిన..

  • Share this:
మెగా బ్రదర్ నాగబాబు లాక్‌డౌన్ తర్వాత బిజీ అయిపోయాడు. కరోనా వైరస్ కారణంగా చాలా రోజుల పాటు ఇంట్లోనే ఉండి తన ఛానెల్‌లో వరస వీడియోలు చేసిన నాగబాబు ఇప్పుడు మరోసారి బిజీ అయిపోయాడు. అదిరింది లాంటి షోకు జడ్జిగా ఉంటూనే.. మరోవైపు కొత్త షోలు మొదలు పెట్టడానికి ఆలోచిస్తున్నాడు నాగబాబు. దీనికి సంబంధించిన ప్రకటనలు కూడా చేసాడు మెగా బ్రదర్. తాజాగా తన యూ ట్యూబ్ ఛానెల్.. మన ఛానెల్ మన యిష్టంలో దీనికి సంబంధించిన అన్ని వివరాలు తెలిపాడు నాగబాబు.
నాగబాబు (Nagababu)
నాగబాబు (Nagababu)

మీకు దమ్ముందా.. నవ్వించే సత్తా ఉందా అని ప్రశ్నిస్తున్నాడు నాగబాబు. ఒకవేళ ఉంటే ఈ ఛాన్స్ మీ కోసమే.. బంగారం లాంటి ఆఫర్ మేం మీ చేతుల్లో పెడుతున్నాం అంటున్నాడు ఈయన. తాజాగా తన యూ ట్యూబ్ ఛానెల్‌లోనే రెండు కొత్త షోలు ప్లాన్ చేస్తున్నాడు. దీనికోసం ఆసక్తి ఉన్న వాళ్లంతా ఎలాంటి ఎంట్రీ ఫీజ్ లేకుండా అప్లై చేసుకోవచ్చంటూ తీపి కబురు చెప్పాడు నాగబాబు.

అన్ని భాషల్లో కూడా స్టాండప్ కామెడీ బాగుందని.. తెలుగులో మాత్రం లేదని అందుకే తన ఛానెల్ దానికి ట్రై చేస్తుందని చెప్పాడు ఈయన. ఆసక్తి ఉన్న వాళ్లు.. నవ్విస్తామనే నమ్మకం ఉన్న వాళ్లంతా సిద్ధంగా ఉండాలని చెప్పాడు నాగబాబు. మరో షో జబర్దస్త్, అదిరింది తరహాలో సాగే స్కిట్స్ షో. ఈ రెండు షోలు ఎలా ఉండబోతున్నాయి.. ఎలా అప్లై చేయాలి అనే విషయం గురించి ఇద్దరు ప్రముఖ కమెడియన్లు వచ్చి చెప్తారని చెప్పాడు నాగబాబు.
నాగబాబు (Nagababu)
నాగబాబు (Facebook/Photo)

వాళ్లిద్దరూ ఎవరనేది మాత్రం చెప్పలేదు ఈయన. ఇందులో కానీ విజేతలుగా నిలిస్తే ఓటిటి ప్లాట్‌ఫామ్స్‌లో పర్ఫార్మ్ చేసే అవకాశం వస్తుందని చెప్పాడు నాగబాబు. కమెడియన్‌లుగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్లకు ఇది నిజంగానే బంగారం లాంటి అవకాశం అంటున్నాడు ఈయన. మరి నాగబాబు ఇచ్చిన అవకాశాన్ని అంది పుచ్చుకునే ఆ కమెడియన్స్ ఎక్కడున్నారో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published: