news18-telugu
Updated: June 8, 2020, 10:32 AM IST
నాగబాబు బాలయ్య వార్ (naga babu balakrishna)
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంలో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు జరిపిన చర్చలకు తనని పిలవలేదని బాలయ్య చెప్పిన మాటలు పెను దుమారాన్ని రేపాయి. అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు మంత్రి తలసానితో కలిసి భూములు పంచుకోవడానికి మాత్రమే కలిసారంటూ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై మెగా బ్రదర్.. బాలయ్యను నోరు అదుపులో పెట్టుకోమంటూ చెప్పిన మాటలు పెను దుమారన్నే రేపాయి. ఈయన కామెంట్స్‌తో మరోసారి నందమూరి, మెగా కంపౌండ్స్ మధ్య ఉన్న వైరం బయటికి వచ్చింది. ఈ ఇష్యూపై బాలయ్య స్పందించడానికి నిరాకరించారు. తాజాగా నాగబాబు.. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య ఇష్యూపై స్పందించారు. తెలంగాణ ప్రభుత్వంతో టాలీవుడ్ ఇండస్ట్రీ జరిపిన చర్చలకు బాలకృష్ణను పిలకపోవడం తప్పా ? రైటా ? అనేది తనకు తెలియదన్నారు. అయితే బాలయ్య మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్లు రియల్ ఎస్టేట్ కోసమే కలిసారంటూ చేసిన వ్యాఖ్యలనే నేను ఖండించానన్నారు. ఈ విషయంలో బాలకృష్ణ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని సినీ పరిశ్రమకు క్షమాపణలు చెప్పాలని మాత్రమే తాను కోరాన్నారు.

బాలయ్యకు నాగబాబు కౌంటర్ (naga babu balakrishna)
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. బాలకృష్ణతో నాకెలాంటి విభేదాలు లేవన్నారు. భూములు విషయమై ఆయన మాట్లాడినందుకే ఆవేశపడ్డానన్నారు. ఆయనకంటూ తనకు ప్రత్యేక గౌరవం ఉందన్నారు. నేను బాలకృష్ణను టార్గెట్ చేయలేదు. ఆయన మాట్లాడింది తప్పు అని మాత్రమే చెప్పాను. ఆయనతో నాకు వ్యక్తిగత శతృత్వం ఏమి లేదన్నారు. బాలకృష్ణ టాలీవుడ్లో పెద్ద హీరో. నేను చిరంజీవి తమ్ముడిని. అదీ కాక ఓ నటుడిని నిర్మాతను కూడా. మా ఇద్దరి మధ్య అసలు పోలికలే లేవన్నారు. ఆయనతో నేను ఎపుడు సమానం అని చెప్పుకోన్నారు. ఇక బాలకృష్ణతో నాకు వ్యక్తిగతంగా పెద్దగా పరిచయం లేదు. కలిసినపుడు హాయ్ అంటే హాయ్ అని పిలుచుకుంటాం. ఆయన కూడా తన మాట్లాడిన మాటలో రియలైజ్ అయ్యారు. ఒకవేళ బాలయ్య కాకున్నా.. ఎవరు ఈ విషయాన్ని మాట్లాడిని నేను స్పందించేవాడినన్నారు. ఒక మీడియా కూడా ఇండస్ట్రీలో ఏమి జరిగినా.. ఏదో మూడో ప్రపంచ యుద్ధం జరిగినట్లు భూతద్దంలో పెద్దదిగా చూపిస్తోంది. మా గొడవలు అన్నీ టీ కప్పులో తుఫాను లాంటివి అంటూ వివాదానికి పులిస్టాప్ పెట్టారు. ఐతే.. జూన్ 9న టాలీవుడ్ ఇండస్ట్రీల పెద్దలు ఏపీ సీఎం జగన్‌తో భేటీ కానున్నారు. ఈ భేటికి బాలకృష్ణ హాజరు కావడం లేదు. తన షష్టి పూర్తి ఉత్సవాల సందర్భంగా బాలయ్య ఈ భేటికి హాజరు కావడం లేదన్న సంగతి నిర్మాత కళ్యాణ్ వెల్లడించిన సంగతి తెలిసిందే కదా.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
June 8, 2020, 10:32 AM IST