హోమ్ /వార్తలు /సినిమా /

Mega 154: చిరంజీవి కొత్త సినిమా టైటిల్ ఇదే..!

Mega 154: చిరంజీవి కొత్త సినిమా టైటిల్ ఇదే..!

చిరంజీవి (Megastar Chiranjeevi Photo : Twitter)

చిరంజీవి (Megastar Chiranjeevi Photo : Twitter)

మెగాస్టార్ వరుస సినిమాలతో బిజీగా మారరు. ఆచర్య ఆన్ స్క్రీన్ రావడంతో మెగాస్టార్ మరి కొన్ని కొత్త సినిమాలతో ఫుల్ బిజీ అయిపోతున్నారు.

  మెగాస్టార్ చిరంజీవి.. వరుస సినిమాలతో బిజీగా మారారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన “ఆచార్య” ఈరోజు థియేటర్లలోకి వచ్చేసింది. సినిమా మెగా ఫ్యాన్స్ కు నచ్చేలా ఉందని కొందరు అంటుంటే, మరోవైపు మిశ్రమ స్పందన లభిస్తోంది. ఇక ఈ మూవీ విడుదలై సినిమా హాళ్లలో అభిమానులను అలరిస్తోంది. ఆచార్య తర్వాత... గాడ్ ఫాదర్ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా చిరు తన కొత్త సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ ఇచ్చారు. మెగా 154 సినిమా టైటిల్‌ను చెప్పేశారు.

  ఇటీవల జరిగిన ‘ఆచార్య’ ప్రమోషన్లలో హరీష్ శంకర్ చేత “భవదీయుడు భగత్ సింగ్”లోని పవర్ ఫుల్ డైలాగును చెప్పించిన చిరు, ఇదే ప్రమోషన్ కార్యక్రమంలో తన నెక్స్ట్ మూవీ టైటిల్ ను కూడా లీక్ చేశారు. ఇటీవల ‘ఆచార్య’ కోసం యంగ్ డైరెక్టర్స్ అందరినీ  చిరంజీవి కలిశారు. ఈ సందర్భంగా తాను బాబీతో చేయబోయే సినిమాకు సంబంధించిన టైటిల్ ను రివీల్ చేశారు.బాబీ డైరెక్షన్ లో చిరు హీరోగా నటిస్తున్న మూవీని “మెగా 154” అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు.

  అయితే ఈ సినిమా కోసం “వాల్తేరు వీరయ్య” అనే టైటిల్ ను అనుకుంటున్నట్టుగా కొన్నాళ్ల క్రితం రూమర్లు విన్పించాయి. ఆ రూమర్లను నిజం చేస్తూ ఇప్పుడు చిరంజీవి స్వయంగా “వాల్తేరు వీరయ్య” అని సినిమా పేరును చెప్పేశారు. విశాఖపట్నం నేపధ్యంలో సాగే ఈ కథనంలో మెగాస్టార్ ముఠా మేస్త్రీ సినిమాలోలా  మాస్ రోల్ లో కనిపించబోతున్నారు. ఈ మూవీలో చిరు అండర్ కవర్ కాప్ పాత్రలో కూడా నటిస్తున్నట్లు సమాచారం. కమర్షియల్ ఎంటర్టైనర్ లో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో మాస్ మహారాజ  రవితేజ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తోంది. హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది.

  మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో వరుస సినిమాలు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆచార్య తెరపైకి వచ్చేయడంతో   భోళా శంకర్, గాడ్ ఫాదర్, బాబీ దర్శకత్వంలో వస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాపై చిరంజీవి దృష్టి పెట్టారు. ఆయా సినిమాల షూటింగుల్లో చిరు ఫుల్ బిజీగా మారారు.

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Chiranjeevi, Director bobby, Megastar Chiranjeevi

  ఉత్తమ కథలు