#మీటూ ఎఫెక్ట్...అర్జున్‌కు బాసటగా నిలిచిన దర్శకుడు

ఏ క్షణానా మొదలైందో మీటూ ఉద్యమం...ఇపుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఆరోణపలపై అర్జున్ స్పందిచకున్నా...ఈ చిత్ర దర్శకుడు అరుణ్ వైద్యనాథన్ మాత్రం రెస్పాండ్ అయ్యాడు. అంతేకాదు అర్జున్‌కు బాసటగా నిలిచాడు.

news18-telugu
Updated: October 21, 2018, 2:39 PM IST
#మీటూ ఎఫెక్ట్...అర్జున్‌కు బాసటగా నిలిచిన దర్శకుడు
యాక్షన్ కింగ్ అర్జున్ (ఫైల్ ఫోటో)
  • Share this:
ఏ క్షణానా మొదలైందో మీటూ ఉద్యమం...ఇపుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రముఖ నటుడు నానా పాటేకర్‌పై తనూశ్రీ దత్తా చేసిన ఆరోపణలతో మొదలైన ఈ మీటూ ఉద్యమం...ఇపుడు అన్ని రంగాలకు విస్తరించింది. ఇప్పటికే ఈ ఎఫెక్ట్‌తో ఎం.జె.అక్బర్ తన కేంద్ర మంత్రి పదవి కోల్పోవాల్సి వచ్చింది.

ఇక దక్షిణాది విషయానికొస్తే..గాయని చిన్మయి...వైరిముత్తు పై చేసిన లైంగిక ఆరోపణలు పెద్ద ప్రకంపనలే సృష్టిస్తున్నాయి. తాజా ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా కన్నడ కథానాయక శృతి హరిహరన్...యాక్షన్ కింగ్ అర్జున్ మీద చేసిన లైంగిక ఆరోపణలు  పెద్ద సంచలనమే క్రియేట్ చేస్తోంది.

ఈ ఆరోణపలపై అర్జున్ స్పందిచకున్నా...ఈ చిత్ర దర్శకుడు అరుణ్ వైద్యనాథన్ మాత్రం రెస్పాండ్ అయ్యాడు. అంతేకాదు అర్జున్‌కు బాసటగా నిలిచాడు. ‘విస్మయ’ షూటింగ్ సందర్భంగా అర్జున్..హీరోయిన్‌తో ఏమాత్రం అసభ్యకరంగా  ప్రవర్తించలేదని దర్శకుడు అరుణ్  వైద్యనాథన్ స్పష్టం చేశాడు. సాధారణంగా దర్శకులు ఒక సన్నివేశాన్ని రాస్తే...దాన్ని నటీనటులు మరింత బాగా రావాలని ఇంప్రొవైజ్ చేస్తుంటారన్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు మ్యాజిక్ జరుగుతుంటుందని దర్శకుడు వ్యాఖ్యానించాడు.


నిజానికి శ్రుతి చెబుతున్న సన్నివేశాన్ని తాను చాలా ఇంటిమేట్‌గా ఉండేలా రాశానన్నారు. ఐతే అర్జున్ మాత్రం.. ఇద్దరు వయసొచ్చిన కూతుళ్లకు తండ్రినైనా తాను ఇపుడు ఇలాంటి సీన్ చేస్తే బాగుండదని చెప్పడంతో ...తాను ఆ సీన్‌ను రీరైట్ చేశానన్నారు.  మొత్తానికి ఈ మూవీ షూటింగ్ మొత్తం సరదగా సాగిపోయిందని వ్యాఖ్యానించాడు. షూటింగ్ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని అరుణ్ స్పష్టం చేసి అర్జున్‌కు అండగా నిలబడ్డాడు.

Published by: Kiran Kumar Thanjavur
First published: October 21, 2018, 1:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading