# మీటూ ఎఫెక్ట్‌: తండ్రి అర్జున్‌పై వచ్చిన ఆరోపణలపై స్పందించిన ఐశ్వర్య

ప్రస్తుతం మీటూ ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా అన్ని భాషలకు చెందిన నటీమణులు తమ జరిగిన చేదు సంఘటనలు, అన్యాయాలపై ఒక్కొక్కరుగా గళమెత్తుతున్నారు. మరోవైపు శృతి హరిహరణ్ చేసిన వ్యాఖ్యలపై అర్జున్ కూతురు ఐశ్వర్య మండిపడ్డారు.

news18-telugu
Updated: October 22, 2018, 6:42 PM IST
# మీటూ ఎఫెక్ట్‌: తండ్రి అర్జున్‌పై వచ్చిన ఆరోపణలపై స్పందించిన ఐశ్వర్య
కూతురు ఐశ్వర్యతో అర్జున్ (Aishwarya Arjun)
  • Share this:
ప్రస్తుతం మీటూ ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా అన్ని భాషలకు చెందిన నటీమణులు తమ జరిగిన చేదు సంఘటనలు, అన్యాయాలపై ఒక్కొక్కరుగా గళమెత్తుతున్నారు. రీసెంట్‌గా యాక్షన్ కింగ్ అర్జున్‌పై నటి శృతి హరిహరన్ చేసిన లైంగిక ఆరోపణలు కోలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. షూటింగ్ సమయంలో అర్జున్ ...తన వెనక భాగాన్ని అసభ్యకరంగా తాకాడని ఫేస్‌బుక్ పేజీలో తన ఆవేదనను వెల్లగక్కింది.

కాగా, శృతి హరిహరన్ చేసిన ఆరోపణలపై ‘నిబునన్’ దర్శకుడు అరున్ వైధ్యనాథన్ కూడా అర్జున్‌కు సపోెర్ట్‌గా మాట్లాడాడు. మరోవైపు ఈ ఇష్యూపై అర్జున్ స్పందిస్తూ...ఇప్పటి వరకు తాను 60 మందిపైగా హీరోయిన్‌లతో కలిసి నటించాను. ఇప్పటి వరకు ఎవ్వరు తనపై ఇలాంటి ఆరోపణలు చేయలేదు. దీన్ని బట్టి నా క్యారెక్టర్ ఎటువంటిదో మీ విజ్ఞతకే ఒదిలేస్తున్నాన్నారు. పైగా వయసొచ్చిన ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా నేను వేరే ఆడవాళ్లతో అలా ఎలా ప్రవర్తిస్తానని చెప్పుకొచ్చారు.

మరోవైపు శృతి హరిహరణ్ చేసిన వ్యాఖ్యలపై అర్జున్ కూతురు ఐశ్వర్య మండిపడ్డారు. ఇన్నేళ్ల జీవితంలో మా నాన్న పబ్‌కు వెళ్లడం నేనెప్పుడు చూడలేదు. అలాంటిది ఆమెను మా నాన్నషూటింగ్ సమయంలో రిసార్ట్‌కు రమ్మని చెప్పడం శుద్ధ అబద్ధం అన్నారు. మా నాన్నపై దుమ్ముత్తిపోయడానికే కొంత మంది పనిగట్టుకొని ఆమెతో ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: October 22, 2018, 6:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading