Meet Cute: నేచురల్ స్టార్ నాని సోదరి దీప్తి గంటా దర్శకత్వం వహించిన తొలి వెబ్ సిరీస్ మీట్ క్యూట్. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నాని ఈ సిరీస్ ను నిర్మించారు. ఐదు కథల ఆంథాలజీగా ఆమె తెరకెక్కించిన ఇందులో వర్ష బొల్లమ్మ, శ్రీదివ్య, సమీర్, అశ్విన్ కుమార్, సత్యరాజ్, రుహానీ సఱ్మ, రాజ్ చెంబోలు, రోహిణి మొల్లేటి, ఆకాంక్షా సింగ్, దీక్షిత్ శెట్టి అలేఖ్య హారిక, ఆదా శర్మ, శివ కందుకూరి, సునైన తదితరులు కీలక పాత్రల్లో నటించారు. త్వరలో సోని లివ్ లో మీట్ క్యూట్ ఎక్స్ క్లూజివ్ ప్రీమియర్ కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగాదర్శకురాలు దీప్తి గంటా మాట్లాడుతూ..నా ఫేవరేట్ మూవీస్ లో ద హాలీడే ఒకటి. ఈ సినిమాలో మీట్ క్యూట్ అనే పదాన్ని విన్నాను.
పరిచయం లేని ఇద్దరు ఊహించని ఒక అందమైన ప్రదేశంలో కలుస్తారు. వీరి మధ్య సాగిన అందమైన సంభాషణ జీవితాంతం గుర్తుండేలా ఉంటుంది. మన లైఫ్ లో ఎదురయ్యే అందమైన సందర్భాలను ఈ అంథాలజీ చూపిస్తుంది. వైవిధ్యమైన కంటెంట్ ను దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు అందిస్తున్న సోని లివ్ ద్వారా మీట్ క్యూట్ ప్రదర్శితం కాబోతుండటం సంతోషంగా ఉందని చెప్పింది.
Prepare yourself to watch the teaser of adorable urban love stories produced by @tprashantii and directed by @mail2ganta. #MeetCute presented by the Natural Star Nani is streaming soon#MeetCuteStories #MeetCuteOnSonyLiv @SonyLIV @NameisNani pic.twitter.com/gD04JiVtlH
— Suresh Kondi (@SureshKondi_) November 12, 2022
నాచురల్ స్టార్ నాని ఇటీవల అంటే సుందరానికీ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్తో వచ్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరిచింది. గత యేడాది నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మూవీ ‘శ్యామ్ సింగరాయ్’.(Shyam Singha Roy )మూవీతో మంచి సక్సెస్ అందుకున్నారు నాని. అంతకు ముందు నాని నటించిన రెండు చిత్రాలు ‘వీ’(V), ‘టక్ జగదీష్’ (Tuck Jagadish) సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలై ఓకే అనిపించుకున్నాయి. ఇక అది అలా ఉంటే నాని కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) తో ‘దసరా’ (Nani Keerthy Suresh Dasara )సినిమాను చేస్తున్నారు.
కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి ఓ అప్ డేట్ వచ్చింది. నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ మాస్ సినిమాగా వస్తోంది. ఓ రేంజ్లో సినిమా థియేట్రికల్ హక్కులు అమ్ముడుపోయినట్టుగా ఇండస్ట్రీ టాక్.
Chiranjeevi - Allu Sirish: చిరంజీవితో అల్లు శిరీష్ నటించిన ఈ సినిమా తెలుసా..
ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌తో పాటు టీజర్‌తో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. దీంతో ఓపెనింగ్స్ కూడా ఓ రేంజ్లో వస్తాయి.. ఇక సినిమాలో కంటెంట్ ఉంటే కలెక్షన్స్ విషయంలో కేకపెట్టిస్తుంది అని ట్రేడ్ వర్గాల టాక్. చూడాలి మరి ఎం జరుగుతుందో.. ఈ సినిమా ( Dasara Release date ) 30 మార్చి, 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని చిత్రబృందం ప్రకటించింది. నాని తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఈ సినిమాలో ఓ పల్లెటూరి యువకుడి పాత్రలో నటిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sony liv, Telugu Cinema, Tollywood