హోమ్ /వార్తలు /సినిమా /

Sita Ramam : అమెరికాలో సీతారామం టీమ్‌తో మీట్ అండ్ గ్రీట్.. 600ల‌కుపైగా పాల్గొన్న ప్రవాసాంధ్రులు..

Sita Ramam : అమెరికాలో సీతారామం టీమ్‌తో మీట్ అండ్ గ్రీట్.. 600ల‌కుపైగా పాల్గొన్న ప్రవాసాంధ్రులు..

Meet and greet with Sitaram team in America

Meet and greet with Sitaram team in America

Sita Ramam : ఇటీవ‌ల విడుద‌లై తెలుగు రాష్ట్రాల‌తోపాటు అమెరికాలో సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా సీతారామం. తాజాగా ఈ చిత్ర బృందం అమెరికాలోని న్యూజెర్సీలో సందడి చేసింది. ఉమానియా సంస్థ‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ఆండ్ గ్రీట్‌లో ఆ చిత్ర బృందం పాల్గొనడంతో పాటు.. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఇటీవ‌ల విడుద‌లై తెలుగు రాష్ట్రాల‌తోపాటు అమెరికాలో సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా సీతారామం. తాజాగా ఈ చిత్ర బృందం అమెరికాలోని న్యూజెర్సీలో సందడి చేసింది. ఉమానియా సంస్థ‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ఆండ్ గ్రీట్‌లో ఆ చిత్ర బృందం పాల్గొనడంతో పాటు.. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంది. ఈ కార్యక్రమంలో ఈ సినిమా హీరో దుల్కర్‌ సల్మాన్ - హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ తో పాటు దర్శకుడు హను రాఘవపూడి, నిర్మాత స్వప్నదత్ తదితరులు పాల్గొన్నారు. ఇంతమంది తెలుగువారిని ఒకేచోట కలుసుకోవటం సంతోషంగా ఉందని,ఇంత అద్భుత ఆవకాశం కల్పించిన ఉమానియా టీం కి ఈ సంద‌ర్భంగా దుల్కర్‌ సల్మాన్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌ముఖ యాంక‌ర్ ఉద‌య‌భాను ఎంతో ఆహ్లాదంగా నిర్వ‌హించారు.

600ల‌కుపైగా ప్రవాసాంధ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నారైల మ‌ధ్య చిత్ర‌యూనిట్ కేక్ క‌ట్ చేశారు.ఈ కార్య‌క్ర‌మంలో UBlood app గురించి సవివరంగా తెలియజేసారు యాప్ ఫౌండర్ జై యలమంచిలి. రక్తదానం గురించి అలాగే రక్త గ్రహీతల పూర్తి సమాచారం కలిగిన యాప్ కావడంతో ఇలాంటి యాప్ ని సృష్టించిన జై యలమంచిలి పై ప్రశంసలు కురిపించారు హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ లు. ఈ వండర్ఫుల్ ఈవెంట్ లో యువ‌త కూడా అధిక సంఖ్య‌లో పాల్గొన్నారు.

అమెరికాలో సీతారామం టీమ్‌తో మీట్ అండ్ గ్రీట్
అమెరికాలో సీతారామం టీమ్‌తో మీట్ అండ్ గ్రీట్

వారి ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేయడానికి ఒక స్పెష‌ల్ టాస్క్ ఇచ్చారు యాంక‌ర్ ఉద‌య‌భాను. హీరో దుల్కర్‌ సల్మాన్ కు - హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ కు ల‌వ్ లెట‌ర్ రాసి ఇంప్రెస్ చేయ‌మ‌ని యూత్‌కు ఒక టాస్క్ ఇవ్వ‌డం ఈ కార్య‌క్ర‌మంలో స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా చెప్పుకొవ‌చ్చు. ఇక చిన్నారుల నృత్యాలు, మహిళల ఫ్యాషన్ షో అందరినీ అలరించాయి. ఈ సినిమాలోని ఒక పాట‌ను పాడిన‌ చిన్నారి ఈషాన్వి ని డైరెక్ట‌ర్ హ‌ను రాఘ‌వ‌పూడి అభినందించారు.

అమెరికాలో సీతారామం టీమ్‌తో మీట్ అండ్ గ్రీట్
అమెరికాలో సీతారామం టీమ్‌తో మీట్ అండ్ గ్రీట్

క‌న్నుల పండ‌వ‌గా జ‌రిగిన కార్య‌క్ర‌మాన్నికి U-BLOOD, JAI SWARAJYA, JSW TV, బాల‌జీ ప్ల‌వ‌ర్స్, కోర‌ల్ బీడ్స్.. గ్రాండ్ స్పాన్స‌ర్ చేశారు. ఈ మీట్ ఆండ్ గ్రీట్‌ ఇంత గ్రాండ్ గా జరగడానికి సహకరించిన ,గ్రాండ్ స్పాన్సర్స్ మరియుమిగతా స్పాన్సర్లుకి ,ప్రేక్షకులకి అందరికి ఉమానియా టీమ్ అంద‌రి త‌రుపున ల‌క్ష్మీ దేవినేని ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు.

First published:

Tags: Sita Ramam, Tollywood news

ఉత్తమ కథలు