హోమ్ /వార్తలు /సినిమా /

Meera Mitun : నెపోటిజం వల్లే సూర్య, విజయ్ ఈ స్థాయిలో... హీరోయిన్ ఘాటు వ్యాఖ్యలు..

Meera Mitun : నెపోటిజం వల్లే సూర్య, విజయ్ ఈ స్థాయిలో... హీరోయిన్ ఘాటు వ్యాఖ్యలు..

విజయ్, సూర్య Photo : Twitter

విజయ్, సూర్య Photo : Twitter

Meera Mitun : తమిళ నటి బిగ్ బాస్ కంటెస్టెంట్ మీరా మిథున్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది.

  తమిళ నటి బిగ్ బాస్ కంటెస్టెంట్ మీరా మిథున్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల సినీ నటి త్రిషపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మీరా.. ఆ హీరోయిన్ కారణంగా తనకు చాలా అవకాశాలు రాకుండా పోయాయని.. త్రిషకు కులపిచ్చి ఎక్కువని అందుకే ఆమె తనకు వచ్చిన అవకాశాల్నీ కూడా రానివ్వకుండా చేసిందని త్రిషపై మీరా తీవ్ర ఆరోపణలు చేసింది. అంతేకాదు తనకు ఎటువంటీ ఛాన్స్‌లు రాకుండా ఇండస్ట్రీలో కొందరూ చూస్తున్నారని.. త్రిష తనను తొక్కేయడానికి ప్రయత్నించిందని పేర్కోంది మీరా. అది అలా ఉంటే ఆమె మరోసారి  కోలీవుడ్ స్టార్స్ సూర్య, విజయ్ లపై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సినీ ఇండస్ట్రీలో నెపోటిజం కారణంగానే సూర్య కానీ, లేదా విజయ్ కానీ.. ఇంత దూరం వచ్చారనీ.. ఇండస్ట్రీలో బంధుప్రీతి వల్లే వీరిద్దరూ తెరపైకి రాగలిగారని.. నెపోటిజం కారణంగానే ఇండస్ట్రీలో నిలదొక్కుకుని ఈ స్థాయిలో ఉన్నారని విమర్శించింది. అయితే ఆమె చేసిన ఆ వ్యాఖ్యలు తమిళ సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి. ఇక మా అభిమాన స్టార్స్‌ను అంతమాట అంటావా అంటూ.. సూర్య, విజయ్ ఫ్యాన్స్ మీరా మిథున్‌పై మండి పడుతూ.. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

  Meera Mitun, Meera Mitun news, Meera Mitun on suriya, Meera Mitun on vijay, tamil film news, మీరా మిథున్, సూర్య, విజయ్
  మీరా మిథున్ Photo : Instagram

  ఇక మీరా చేసిన వ్యాఖ్యలపై నటుడు సూర్య స్పందించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కావాలనే కొందరూ వ్యక్తులు చేసే విమర్శలపై స్పందించి.. సమయాన్ని వృథా చేసుకోవద్దని.. అంతేకంటే ఆ సమయాన్ని సమాజం కోసం, దాని బాగు కోసం ఉపయోగించాలనీ తెలిపాడు. ఇక సూర్య సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం ఆకాశం నీ హద్దురా.. అనే సినిమా చేస్తున్నాడు. ఎప్పుడో రెడీ అయ్యి.. విడుదల సిద్దమైన ఈ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. తాజా సమాచారం మేరకు ఈ సినిమాను ప్రముఖ ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Suriya, Vijay

  ఉత్తమ కథలు