హోమ్ /వార్తలు /సినిమా /

Meera Mithun-Vishal : విశాల్ పెళ్లి చేసుకోమని రెండేళ్లు వెంటపడ్డాడు.. నటి వివాదస్పద వ్యాఖ్యలు..

Meera Mithun-Vishal : విశాల్ పెళ్లి చేసుకోమని రెండేళ్లు వెంటపడ్డాడు.. నటి వివాదస్పద వ్యాఖ్యలు..

మీరా మిథున్, విశాల్ Photo : Twitter

మీరా మిథున్, విశాల్ Photo : Twitter

Meera Mithun - Vishal : తమిళ సంచలన నటి మీరా మిథున్‌ మరో బాంబ్ పేల్చింది. ఆమె తాజాగా ఓ వీడియోను విడుదల చేసింది.

తమిళ సంచలన నటి మీరా మిథున్‌ మరో బాంబ్ పేల్చింది. ఆమె తాజాగా ఓ వీడియోను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ గా మారింది. ఈ తాజా వీడియోలో మీరా మాట్లాడుతూ `విశాల్‌ నన్ను పెళ్లి చేసుకుంటానని రెండు మూడు సంవత్సరాలుగా అడుగుతున్నాడు. కానీ డబ్బున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. అందుకే అతనితో పెళ్లికి నిరాకరించినట్లుగా తెలిపింది. అయితే ఈ వీడియో చూసిన విశాల్ అభిమానులు ఆమెను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ఇక విశాల్ ఆ వీడియోను చూసి ఏవిధంగా స్పందిస్తాడో చూడాలి. మీరా మిథున్‌ ఇటీవల సూర్య విజయ్‌‌లను కూడా వదిలి పెట్టకుండా వారిపై కొన్ని ఆరోపణలు చేసింది. దీంతో మీరాపై తమిళ సినీ పరిశ్రమ పెద్దలు గుర్రుగా ఉన్నారు. ఇటీవల దర్శకుడు భారతీ రాజా కూడా ఆమెకు వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు మీరా.. ఇటీవల సినీ నటి త్రిషపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.. ఆ హీరోయిన్ కారణంగా తనకు చాలా అవకాశాలు రాకుండా పోయాయని.. త్రిషకు కులపిచ్చి ఎక్కువని అందుకే ఆమె తనకు వచ్చిన అవకాశాల్నీ కూడా రానివ్వకుండా చేసిందని త్రిషపై తీవ్ర ఆరోపణలు చేసింది మీరా.

అంతేకాదు తనకు ఎటువంటీ ఛాన్స్‌లు రాకుండా ఇండస్ట్రీలో కొందరూ చూస్తున్నారని.. త్రిష తనను తొక్కేయడానికి ప్రయత్నించిందని పేర్కోంది. ఇక సినీ ఇండస్ట్రీలో నెపోటిజం కారణంగానే సూర్య, విజయ్.. ఇంత దూరం వచ్చారనీ.. ఇండస్ట్రీలో బంధుప్రీతి వల్లే వీరిద్దరూ తెరపైకి రాగలిగారని.. నెపోటిజం కారణంగానే ఇండస్ట్రీలో నిలదొక్కుకుని ఈ స్థాయిలో ఉన్నారని విమర్శించింది మీరా. అయితే దర్శకుడు భారతీ రాజా ఈ విషయంలో ఆమెకు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఇలా మీరా ఏదో ఒక కొత్త వివాదంతో రోజు వార్తల్లో ఉంటూ ట్రెండింగ్ అవుతోంది.

First published:

Tags: Tollywood news, Vishal

ఉత్తమ కథలు