Home /News /movies /

MEERA JASMINES BEAUTY THAT HAS NOT DIMINISHED AFTER MANY YEARS DANCE VIDEO VIRAL ON SOCIAL MEDIA SNR

ఏజ్ పెరిగే కొద్ది ఆమె గ్లామర్ పెరుగుతోంది .. సీక్రెట్ ఏంటీ

Photo Credit:Instagram

Photo Credit:Instagram

MeeraJasmine: ఆమె తెలుగు హీరోల పక్కన కనిపించక చాలా ఏళ్లు అవుతోంది. గతంలో హిట్ సినిమాల్లో అలా మెరిసి ..ఇలా మాయమైన మీరాజాస్మిన్ ఇప్పుడు సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్ చేయబోతున్నట్లు కనిపిస్తోంది. ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన వీడియో చూసిన వాళ్లంతా వాటే బ్యూటీ అంటున్నారు.

ఇంకా చదవండి ...
టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోల పక్క నటించిన మీరాజాస్మిన్ మళ్లీ లైమ్‌లైట్‌(Limelight)లోకి వచ్చింది. క్యూట్‌ ఫేస్, అమాయకపు చూపులతో చాలా మంది అభిమానుల హృదయాల్లో చెరగని ముద్రవేసుకుంది. అతి తక్కువ కాలంలోనే హిట్‌ సినిమాల్లో యాక్ట్ చేసింది. ఆ తర్వాత చెల్లెలి పాత్రతో మీరాజాస్మిన్‌( Meera Jasmine)కెరియర్‌ స్లో అయింది. కాస్త బొద్దుగా మారడంతో టాలీవుడ్‌లో సినిమా ఆఫర్లు తగ్గాయి. దాంతో తెలుగు సినిమాల్లో కనిపించడం మానేసింది. లేటెస్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో యాక్టివ్‌ అయ్యారు మీరాజాస్మిన్. చాలా రోజుల తర్వాత ఆనందంగా డ్యాన్స్ చేస్తున్న ఓ వీడియోని పోస్ట్ చేసింది మీరాజాస్మిన్‌. డ్యాన్స్ చేస్తున్న వీడియో(Dance video)తో పాటు ఆమె షేర్ చేసుకున్న కామెంట్స్‌ చూస్తుంటే సెకండ్‌ ఇన్నింగ్స్‌ (Second innings)స్టార్ట్ చేస్తుందా అనే డౌట్స్‌ కలుగుతున్నాయి. అయితే సినిమాల నుంచి చాలా రోజుల క్రితమే ఫేడ్ అవుట్ అయిన ఈ ముద్దుగుమ్మ గ్లామర్‌ ఇప్పటికి చెక్క చెదరలేదు. అప్పుడు ఉన్న అందం కంటే రెట్టింపు గ్లామర్‌గా కనిపించారు మీరాజాస్మిన్(Meera Jasmine). మీరా జాస్మిన్‌ వీడియోని చూస్తున్న వాళ్లంతా మేరా జాస్మిన్ అంటూ ఆమె పాత సినిమాల్ని గుర్తుకు చేసుకుంటున్నారు. అప్పటి గుడంబా శంకర్‌ సినిమాలోని చిట్టి నడుమునే చూస్తున్న పాటకు సరిగ్గా సూటయ్యేలా ఇప్పుడు తయారైంది మీరా జాస్మిన్.




చిక్కిన నడుముతో ఫిదా చేస్తున్న జాస్మిన్..
రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచిన మీరాజాస్మిన్..మొదట ఫోటోలతో అభిమానులకు టచ్‌లోకి వచ్చింది. ఇప్పుడు తన వీడియోలతో లక్షల్లో లైకులను సొంతం చేసుకుంటోంది. మీరా జాస్మిన్‌ తన న్యూలుక్‌తో గ్లామర్‌గా కనిపించడంతో అందరూ ఆమెను తెగ లైక్ చేస్తున్నారు. అందుకు రిప్లైగా తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు చెబుతోంది మీరా జాస్మిన్. అందమైన ప్రయాణం ముందుంది అంటూ మీ ప్రేమతో మీరా జాస్మిన్ అంటూ కామెంట్స్ పోస్ట్ చేసింది.

రీఎంట్రీ కోసమే అంటూ పోస్ట్..
మీరా జాస్మిన్‌ అసలు పేరు జాస్మిన్ మేరీ జోసెఫ్‌. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లో యాక్ట్ చేసిన ఈ అమ్మడు 2004లో జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంది. తెలుగులో గుడుంగా శంకర్‌లో పవన్‌ కల్యాణ్‌ పక్కన, భద్రలో రవితేజకు జోడిగా యాక్ట్ చేసింది. మహారథి సినిమాలో బాలకృష్ణతో అమ్మాయి బాగుంది సినిమాలో శివాజీతో స్క్రీన్‌ షేర్ చేసుకుంది మీరాజాస్మిన్.
Published by:Siva Nanduri
First published:

Tags: Meera Jasmine, Meera jasmine cute photos

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు