మీనా హార్ట్ బ్రేక్ చేసిన హృతిక్ రోషన్.. సోషల్ మీడియా వేదికగా..

మీనా, హృతిక్ రోషన్ Photo : Twitter

మీనా ఒకప్పుడు తెలుగులో అందరి హీరోల సరసన నటించి తెలుగు వారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న అందాల నటి.

 • Share this:
  మీనా ఒకప్పుడు తెలుగులో అందరి హీరోల సరసన నటించి తెలుగు వారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న అందాల నటి. మీనా అందగత్తే కాదు. మంచి నటి కూడా. తెలుగులో వెంకటేష్, చిరంజీవి, నాగార్జున ఇలా అందరితో ఆడిపాడింది. కాగా లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్న మీనా సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో మాట్లాడింది. ఈ సందర్భంగా మీనా తనకు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అంటే చాలా ఇష్టమని పేర్కోంది. ఆమె మాట్లాడుతూ.. 2000లో హృతిక్ వివాహం తరువాత జరిగిన రిసెప్షన్ కు తాను వెళ్లానని, ఆ సమయంలో అతన్ని గ్రీట్ చేస్తున్నసమయంలో ఓ అభిమానిగా, ఓ అమ్మాయిగా చాలా ఫీల్ అయ్యానని పేర్కోంది. బెంగళూరులో జరిగిన ఆ విందు కార్యక్రమంలో హృతిక్‌ను కలిశానని, ఆ రోజు తన గుండె బద్ధలైనంత పనైందని చెప్పింది. ఈ సందర్భంగా అప్పుడు మీనా హృతిక్ కు శుభాభినందనలు చెబుతున్న ఫోటోను అభిమానులతో పంచుకుంది. ఇక మీనా సినీ కెరీర్‌ విషయానికి వస్తే.. ఆమె ప్రస్తుతం పలు సీరియల్స్‌తో పాటు సినిమాలు చేస్తోంది. మరోవైపు కొన్ని రియాలిటీ షోలకు జడ్జ్‌గా కూడా చేస్తోంది.
  View this post on Instagram

  The day my heart broke 😄 met my all time favorite in Bangalore on his post wedding get together ❤❤ @hrithikroshan


  A post shared by Meena Sagar (@meenasagar16) on
  Published by:Suresh Rachamalla
  First published: