హోమ్ /వార్తలు /సినిమా /

Balakrishna-Rajinikanth: రజినీకాంత్, బాలకృష్ణలతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన మీనా..

Balakrishna-Rajinikanth: రజినీకాంత్, బాలకృష్ణలతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన మీనా..

రజినీకాంత్, మీనా, బాలకృష్ణ(Instagram/Meena/Photo)

రజినీకాంత్, మీనా, బాలకృష్ణ(Instagram/Meena/Photo)

Balakrishna-Rajinikanth:సూపర్ స్టార్ రజినీకాంత్, బాలకృష్ణలతో దిగిన పాత ఫోటోను నటి మీనా.. తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

  Balakrishna-Rajinikanth:సూపర్ స్టార్ రజినీకాంత్, బాలకృష్ణలతో దిగిన పాత ఫోటోను నటి మీనా.. తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫోటో.. బాలకృష్ణ, మీనా, రోజా హీరో హీరోయిన్లుగా ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బొబ్బిలి సింహం’ ముహూర్తపు షాట్‌కు సంబంధించినది. ఈ సినిమా ముహూర్తపు షాట్‌కు రజినీకాంత్ ముఖ్య అతిథిగా  హాజరై క్లాప్ కొట్టారు. మీనా విషయానికొస్తే.. ఈమె బాలయ్యతో ‘అశ్వమేథం’, ‘బొబ్బలి సింహం’, ‘ముద్దుల మొగుడు’తో పాటు ‘కృష్ణబాబు’ సినిమాల్లో  కలిసి నటిచింది. ఈ నాలుగు చిత్రాల్లో ‘బొబ్బిలి సింహం’ మాత్రమే బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.  మరోవైపు మీనా.. రజినీకాంత్‌తో ‘ముత్తు’ సహా పలు చిత్రాల్లో కథానాయికగా నటించింది. ఇక ముత్తు సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రంలో మీనా.. నాట్యగత్తే పాత్రలో అలరించింది.

  View this post on Instagram


  A post shared by Meena Sagar (@meenasagar16)  అప్పట్లో ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. కే.యస్.రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో జపాన్‌లో విడుదలైంది.  అక్కడ కూడా ఈ చిత్రం ఓ రేంజ్‌లో నడిచింది.  రజినీకాంత్‌కు జపాన్‌ సహా పలు దేశాల్లో అభిమానులు ఏర్పడడానికి ముత్తు సినిమానే కారణం అనే చెప్పాలి. ముఖ్యంగా ‘థిల్లానా థిల్లాన’ నా కసి కళ్ల కూన అంటూ ఏ.ఆర్.రహమాన్ అందించిన మ్యూజిక్‌కు రజినీకాంత్,మీనా డాన్సులు అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్. ఇప్పటికే ఈ సినిమా కానీ.. పాట కానీ టీవీల్లో వస్తే.. చూసే ప్రేక్షకులున్నారు. ప్రస్తుతం మీనా.. టీవీల్లో ప్రసారమయ్యే కొన్ని రియాలిటీ షోలకు జడ్డ్‌గా వ్యవహరిస్తోంది. అంతేకాదు మంచి క్యారెక్టర్ ఉంటే.. మళ్లీ నటించడానికి రెడీ అంటోంది ఈ భామ.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Balakrishna, Balayya, Kollywood, Meena, NBK, Rajinikanth, Tollywood

  ఉత్తమ కథలు