• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • MEE TOO SAVED SAI PALLAVI FROM LIP LOCK SCENE MHN

Sai Pallavi About Liplock: కిస్సింగ్ సీన్ నుండి మీ టూ త‌న‌ను కాపాడింద‌న్న సాయిప‌ల్ల‌వి

Sai Pallavi About Liplock: కిస్సింగ్ సీన్ నుండి మీ టూ త‌న‌ను కాపాడింద‌న్న సాయిప‌ల్ల‌వి

mee too saved sai pallavi from lip lock scene

Sai Pallavi - Meetoo: ఓ సినిమాలో రొమాంటిక్ స‌న్నివేశంలో ద‌ర్శ‌కుడు లిప్‌లాక్ చేయాల్సిందిగా సాయిప‌ల్ల‌విని అడిగిన‌ప్పుడు తన‌కు లిప్‌లాక్ సీన్స్ చేయ‌డం కంఫ‌ర్ట్‌గా ఉండ‌ద‌ని చెప్పింద‌ట‌. ఓ ర‌కంగా మీ టూ ఉద్య‌మం వల్లే తాను లిప్‌లాక్ సీన్ చేయ‌కుండా త‌ప్పించుకోగ‌లిగాన‌ని సాయిప‌ల్ల‌వి చెప్పింది.

  • Share this:
    ఏ సినిమా ప‌డితే అది.. ఏ పాత్ర దొరికితే అది చేసే ర‌కం సాయిప‌ల్ల‌వి కాదు. ఓ ప‌ట్టాన న‌చ్చితే కానీ న‌టించ‌డానికి ఓకే చెప్ప‌దు. అంతే కాకుండా రొమాంటిక్ సీన్స్‌లో.. గ్లామ‌ర్ పాత్ర‌లు చేయ‌డానికి ముందుగానే నో చెప్పేస్తుంది. అలాంటిది ఓ సంద‌ర్భంలో ఓ సినిమాలో ద‌ర్శ‌కుడు సాయిప‌ల్ల‌విని చిన్న‌పాటి ఇబ్బందిని క‌లిగించ‌డానికి ప్ర‌య‌త్నిస్తే సాయిప‌ల్ల‌వి సింపుల్‌గా అత‌ని స్పీడుకి బ్రేకులేసింద‌ట‌. ఇంత‌కీ సాయిప‌ల్ల‌వికి క‌లిగిన ఇబ్బంది ఏంటి? అనే వివ‌రాల్లోకెళ్తే.. ఓ సినిమాలో హీరో, హీరోయిన్‌పై రొమాంటిక్ స‌న్నివేశాన్ని తెర‌కెక్కిస్తున్నార‌ట‌. అప్పుడు ద‌ర్శ‌కుడు సాయిప‌ల్ల‌వి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి హీరో పెద‌వుల‌పై ముద్దు పెట్టుకోవాల‌ని చెప్పాడ‌ట‌. అయితే అలాంటి సన్నివేశాలు చేయ‌డం త‌న‌కు కంఫ‌ర్ట్‌గా అనిపించ‌ద‌ని ఆ ద‌ర్శ‌కుడికి స్పాట్‌లోనే చెప్పేసింద‌ట‌. అదే స‌మ‌యంలో మీటూ ఉద్య‌మం ఉధృతంగా ఉండ‌టంతో స‌ద‌రు ద‌ర్శ‌కుడు కూడా సాయిప‌ల్ల‌విని కిస్సింగ్ సీన్‌లో న‌టించాలంటూ పెద్ద‌గా ఇబ్బంది పెట్ట‌లేద‌ట‌.

    మీ టూ ఉద్య‌మం త‌నను కిస్సింగ్ సీన్ చేయ‌కుండా కాపాడింద‌ని రీసెంట్‌గా జ‌రిగిన‌ ఓ ఇంట‌రాక్ష‌న్‌లో సాయిప‌ల్ల‌వి చెప్పింది. సాయిప‌ల్ల‌వి త‌మిళంలో పావ‌క‌థైగ‌ల్ అనే వెబ్‌సిరీస్‌లో న‌టించింది. నాలుగు క‌థ‌లుగా రూపొందిన ఈ వెబ్ సిరీస్‌లో ఓ క‌థ‌లో సాయిప‌ల్ల‌వి న‌టించింది. ఇందుల సాయిప‌ల్ల‌వి తండ్రి పాత్ర‌లో ప్ర‌కాశ్‌రాజ్ న‌టించాడు. ఈ వెబ్‌సిరీస్‌లో ఒక్కొక్క క‌థ‌ను ఒక్కొక్క ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించాడు. వెట్రిమార‌న్‌, గౌత‌మ్‌మీన‌న్‌, సుధాకొంగ‌ర‌, విఘ్నేశ్ శివ‌న్ ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేశారు. డిసెంబ‌ర్ 18న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వెబ్ సిరీస్ ప్ర‌సారం కానుంది. ఇందులో అంజ‌లి, క‌ల్కికొచ్లిన్‌, గౌత‌మ్ మీన‌న్‌, సిమ్రాన్‌, సంత‌ను భాగ్య‌రాజ్‌, కాళిదాస్‌, జ‌య‌రామ్‌, భ‌వానీ శ్రీ త‌దిత‌రులు ఇత‌ర పార్టుల్లో న‌టిస్తున్నారు.

    ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. తెలుగులో ఫిదా, ఎంసీఏ చిత్రాల‌తో త‌న కంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్న సాయిప‌ల్ల‌వి.. త‌మిళ చిత్రాల్లోనూ న‌టించింది. ప్ర‌స్తుతం రానాతో విరాట‌ప‌ర్వం సినిమాలో సాయిప‌ల్ల‌వి న‌టిస్తుంది. అలాగే నాని టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న శ్యామ్ సింగ‌రాయ్ సినిమాలోనూ సాయిప‌ల్ల‌వి ఓ హీరోయిన్‌గా న‌టిస్తుంది.
    Published by:Anil
    First published:

    అగ్ర కథనాలు