#MeToo: అప్పుడు మెచ్చుకొని...ఇప్పుడు ఆరోపణలా..?: అర్జున్

శృతి ఆరోపణలను విని షాకయ్యానని..అందులో నిజం లేదని ఆయన కొట్టిపారేశారు. దీని వెనక కుట్ర ఉన్నట్లు అనిపిస్తోందని అర్జున్ అభిప్రాయపడ్డారు.

news18-telugu
Updated: October 21, 2018, 9:06 PM IST
#MeToo: అప్పుడు మెచ్చుకొని...ఇప్పుడు ఆరోపణలా..?: అర్జున్
సినీ నటుడు అర్జున్ అసలు పేరు శ్రీనివాస సర్జ (ఫైల్ ఫోటో)
  • Share this:
బాలీవుడ్‌లో ప్రకంపనలు రేపిన 'మీ టూ' ఉద్యమం..ఇప్పుడు కోలీవుడ్‌ను కుదిపేస్తోంది. ప్రముఖ నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్‌ తనను వేధించారని నటి శృతి హరిహరణ్‌ ఆరోపించడంతో..తీవ్ర దుమారం రేగింది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు అర్జున్ స్పందించారు. శృతి ఆరోపణలను విని షాకయ్యానని..అందులో నిజం లేదని ఆయన కొట్టిపారేశారు. దీని వెనక కుట్ర ఉన్నట్లు అనిపిస్తోందని అర్జున్ అభిప్రాయపడ్డారు. ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీ టూ ఆరోపణలపై ఆయన మాట్లాడారు.

శృతి ఆరోపణలు విని షాక్‌ అయ్యా. దీనిపై మాట్లాడకుంటే నిజంగానే తప్పు చేశానని ప్రజలు భావిస్తారు. అందుకే స్పష్టత ఇస్తున్నా. ఆమెఆ ఆరోపణల్లో నిజం లేదు. నా అనుభవం దృష్ట్యా షూటింగ్‌లో దర్శకులు సలహాలు అడుగుతుంటారు. మంచి సలహా ఇస్తే పాటిస్తారు. లేదంటే ..ఇంకాస్త విభిన్నంగా చేద్దామంటారు. ఆ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. అవి చేయడానికి నేను ఒప్పుకోలేద. సౌకర్యంగా లేదని దర్శకుడికి చెప్పా. అలాంటి సన్నివేశాలు ఖచ్చితంగా ఉండాలనుకుంటే ప్రాజెక్టు నుంచి తప్పుకుంటానని ముందే చెప్పా. నిజంగానే అలా చేసి ఉంటే అప్పుడు నన్ను ఎందుకు ప్రశంసించింది? ఇప్పుడు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతోంది. దీని వెనుక ఎవరైనా ఉన్నారా?
అర్జున్


కాగా, అర్జున్ తనను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు కన్నడ నటి శృతి హరిహరన్ ఇటీవల సంచలన ఆరోపణలు చేసింది. తాము జంటగా నటించిన ‘నిపుణన్’ సినిమా షూటింగ్ సమయంలో అర్జున్ అభ్యంతరకరమైన రీతిలో తనతో ప్రవర్తించినట్లు ఆమె ట్విట్టర్‌లో నాలుగు పేజీల ప్రకటనను పోస్ట్ చేసింది. అభ్యంతరకరమైన రీతిలో తనను తాకడంతో తాను షాక్‌కు గురైనట్లు తెలిపారు. అర్జున్ ప్రవర్తన తనకు తీవ్ర ఆగ్రహం తెప్పించిందని, అయితే దీన్ని బహిరంగంగా చెప్పే దైర్యం అప్పట్లో తనకు లేదని శృతి తెలిపింది. మీ టూ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన శృతి...లైంగిక వేధింపులకు గురైన అందరూ తమ చేదు అనుభవాన్ని బయటపెట్టాలని సూచించారు.
Published by: Shiva Kumar Addula
First published: October 21, 2018, 8:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading