#Me Too: త‌ను శ్రీ ద‌త్తా ఎఫెక్ట్.. నానా ప‌టేక‌ర్‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు..

టాలీవుడ్‌లో శ్రీ‌రెడ్డి ఎలాగైతే కాస్టింగ్ కౌచ్‌పై ర‌చ్చ లేపిందో.. ఇప్పుడు బాలీవుడ్ లో త‌ను శ్రీ ద‌త్తా కూడా ఇదే చేసింది. ప‌దేళ్ల కింద వ‌చ్చిన "హార్న్ ఓకే ప్లీజ్" సెట్ లో త‌న‌తో నానా ప‌టేక‌ర్ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడంటూ ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఇదే ర‌చ్చ జ‌రుగుతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 11, 2018, 4:30 PM IST
#Me Too: త‌ను శ్రీ ద‌త్తా ఎఫెక్ట్.. నానా ప‌టేక‌ర్‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు..
నానా పటేకర్, తనుశ్రీదత్తా
  • Share this:
టాలీవుడ్‌లో శ్రీ‌రెడ్డి ఎలాగైతే కాస్టింగ్ కౌచ్‌పై ర‌చ్చ లేపిందో.. ఇప్పుడు బాలీవుడ్ లో త‌ను శ్రీ ద‌త్తా కూడా ఇదే చేసింది. ప‌దేళ్ల కింద వ‌చ్చిన "హార్న్ ఓకే ప్లీజ్" సెట్ లో త‌న‌తో నానా ప‌టేక‌ర్ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడంటూ ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఇదే ర‌చ్చ జ‌రుగుతుంది. ఎక్క‌డ చూసినా కూడా త‌ను శ్రీ వ్యాఖ్యల‌తోనే బాలీవుడ్ వేడెక్కిపోతుంది.

#Me Too: త‌ను శ్రీ ద‌త్తా ఎఫెక్ట్.. నానా ప‌టేక‌ర్‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు.. #Me too: Tanushree dutta filed FIR against nana patekar and 2 others..
తను శ్రీ నానా పటేకర్


ఇప్పుడు నానా ప‌టేక‌ర్‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేసారు పోలీసులు. ఆయ‌న‌తో పాటు "హార్న్ ఓకే ప్లీజ్" డైరెక్ట‌ర్ రాకేష్ స‌రంగ్.. నిర్మాత సామి సిద్ధిఖీ.. కొరియోగ్ర‌ఫ‌ర్ గ‌ణేష్ ఆచార్యపై కూడా ఎఫ్ఐఆర్ న‌మోదైంది. ఐపిసి సెక్ష‌న్ 354.. 509 కింద ఎఫ్ఐఆర్ న‌మోదు చేసారు. ఈ విష‌యంపై త‌ను శ్రీ త‌ర‌ఫు లాయ‌ర్ నితిన్ స‌త్ఫుటే కూడా స్పందించారు. త‌ను శ్రీ ద‌త్తా చెప్పిన స్టేట్ మెంట్ పోలీసులు మ‌రాఠీలో రాసార‌ని.. ఆ త‌ర్వాత దాన్ని ఇంగ్లీషులోకి మార్చార‌ని చెప్పాడు.

#Me Too: త‌ను శ్రీ ద‌త్తా ఎఫెక్ట్.. నానా ప‌టేక‌ర్‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు.. #Me too: Tanushree dutta filed FIR against nana patekar and 2 others..
తనుశ్రీ దత్తా, నానా పాటేకర్


ఇలాంటి వాళ్ల‌కు శిక్ష ప‌డిన‌పుడే మ‌ళ్లీ ఇలాంటి ఘ‌ట‌న‌లు రిపీట్ కావ‌ని చెబుతున్నాడు నితిన్. 40 పేజీల కంప్లైంట్ రాసి ముంబై పోలీసుల‌తో పాటు మ‌హిళా క‌మీష‌న్ కు కూడా ఇచ్చింది త‌ను శ్రీ‌. ప‌దేళ్ల కింద హార్న్ ఓకే ప్లీజ్ సెట్ లో ఓ డాన్స్ నెంబ‌ర్ చేస్తున్న‌పుడు త‌న‌తో నానా అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని ఆరోప‌ణ చేసింది త‌ను. ఇప్పుడు ఈ ర‌చ్చ ఎక్క‌డ ఆగుతుందో తెలియ‌డం లేదు కానీ త‌ను శ్రీ పోసిన ఆజ్యం మాత్రం మండుతూనే ఉంది.
Published by: Praveen Kumar Vadla
First published: October 11, 2018, 4:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading