మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (Marvel Cinematic Universe’s) సూపర్ హీరోల సినిమాలకు పెట్టింది పేరు. ఇప్పటికే ఫేస్ 4 సినిమాలను విడుదల చేస్తోంది ఎంసీయూ. నవంబర్ 5, 2021 థియేటర్స్‌లో విడుదల అయిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు చేసని టాప్ 12 సినిమాల్లో ఒక్కటిగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాను ఓటీటీల్లో విడుదల చేసేందుకు మార్వెల్ స్టూడియోస్ తేదీ నిర్ణయించింది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, హిందీ భాషల్లో జనవరి 12, 2022 నుండి Disney+ Hotstarలో ప్రసారం చేసేందుకు నిర్ణయించుకొంది. యాక్షన్, సస్పెన్స్ డ్రామాతో నడిచే ఈ సూపర్ హీరో మూవీకి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా ఓటీటీ (OTT) డేట్స్ రిలీజ్ ప్రకటించడంపై ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
Marvel Studios' @Eternals arrives to #DisneyPlusHotstar on January 12 in Hindi, Tamil, Telugu, Malayalam and Kannada ✨ pic.twitter.com/i76S3ZleJw
— Disney+ Hotstar (@DisneyPlusHS) December 11, 2021
ఏమిటీ ఇటర్నల్స్..
మానవుడు పుట్టినప్పటి నుంచి భూమిని రక్షించిన హీరోల సమూహాన్ని ఈ చిత్రంలో కనిపిస్తారు. ఈ మూవీలో క్రూరమైన జీవులు డెవియంట్స్ అని పిలస్తారు. చాలా కాలంగా చరిత్రలో తప్పిపోయి, రహస్యంగా తిరిగి వచ్చినప్పుడు, మానవాళిని మరోసారి రక్షించడానికి ఎటర్నల్స్ మళ్లీ ఏకమై మానవాళిని రక్షించడమే ఈ సినిమా.
Most Expensive Book: ఆ పుస్తకం ధర రూ.3,56,62,942.. ఏమిటీ ప్రత్యేకత.. ఎందుకంత ఖరీదు!
ఈ చిత్రంలో మానవజాతిని ప్రేమించే సెర్సీగా గెమ్మా చాన్, సర్వశక్తిమంతుడైన ఇకారీస్‌గా రిచర్డ్ మాడెన్, కాస్మిక్-పవర్డ్ కింగోగా కుమైల్ నంజియాని, శాశ్వతమైన యువకుడిగా, వృద్ధాప్య స్ప్రైట్‌గా లియా మెక్‌హగ్, మేధావిగా బ్రియాన్ టైరీ హెన్రీ నటించారు.
మార్వెల్(Marvel) ఫాన్స్ ఇటు.. స్పెడర్ మ్యాన్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా స్పైడర్ మ్యాన్- నో వే హోమ్ (Spider Man No way Home). ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్, ట్రైలర్ విడుదల చేసింది. ఈ సినిమాను సోనీ పిక్చర్స్, మార్వెల్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా డిసెంబర్ 16, 2021న విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. ఈ సినిమా టికెట్ల బుకింగ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్, సోని పిక్చర్స్, మార్వెల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను పెంచేసింది. అవేంజర్ ఎండ్ గేమ్ కలెక్షన్‌లతో స్పైడర్ మ్యాన్- నో వే హోమ్ పోటీపడుతుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.
మార్వెల్ ఓటీటీ బాట..
ప్రముఖ సూపర్ హీరో సిరీస్‌లను అందించే మార్వెల్ ఓటీటీ బాట పట్టింది. ఇటు థియేటర్స్‌లో విడుదల చేయడంతోపాటు వాండవిజన్, ఫాల్కన్ ది వింటేజ్ సోల్జర్, లోకి, హాకాయ్ వంటి సూపర్ హీరో సిరీస్‌లను ఇప్పటికే ఓటీటీల రూపంలో విడుదల చేస్తోంది. ఇకపై మరిన్ని కొత్త ప్రాజెక్టులతో ఓటీటీ ఫ్యాన్స్‌కు మార్వెల్ కొత్త సిరీస్‌లను అందించే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Disney+ Hotstar, Hollywood, Ott, Telugu Movie