Mayilsamy:చిత్ర సీమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి నిన్న నందమూరి తారకరత్న 23 రోజులు పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూసిన సంగతి మరవక ముందే సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. తమిళంలో పలు సినిమాల్లో తన హాస్యంతో అలరించిన నటుడు మయిల్ సామి అనారోగ్యంతో కన్నుమూసారు. ఆయన వయసు 57 ఏళ్లు. 1984లో కమెడియన్‌గా సినీ ప్రస్థానం మొదలు పెట్టిన ఈయన ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఎన్నో సినిమాల్లో తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కితకితలు పెట్టారు. చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉన్నారు. ఈ రోజు ఉదయం ఒంట్లో నలతగా ఉండటంతో కుటుంబ సభ్యులు సమీపంలోని పోరూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఆయన్ని పరీక్షించి అప్పటికే ఆయన మరణించినట్టు చెప్పడంతో కోలీవుడ్ చిత్ర సీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈయన మృతిపై తమిళ సినీ నటులు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కూడా మలై స్వామి మరణంపై ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా తమిళసై మాట్లాడుతూ.. హాస్యనటుడు మయిల్ సామి అనారోగ్య కారణాలతో మరణించారనే వార్త విని బాధపడినట్టు పేర్కొన్నారు.
#JUSTIN | கட்சி எல்லைகள் கடந்து நட்பு பாராட்டியவர் - ஆளுநர் தமிழிசை#Mayilsamy | #RipMayilsamy | #TamilisaiSoundararajan | @DrTamilisaiGuv pic.twitter.com/3prtaenxef
— PuthiyathalaimuraiTV (@PTTVOnlineNews) February 19, 2023
అంతేకాదు రాజకీయాలకు అతీతంగా ఆయన అన్ని పార్టీలతో స్నేహం కొనసాగించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అంతేకాదు విరుగంపాక్కం ప్రాంత ప్రజలకు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తన హాస్యంతో ప్రజల హృదయాల్లోకి నిలిచి పోయిన ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు అన్నారు. ఈ సందర్భంగా మయిల్ సామి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Governor Tamilisai Soundararajan, Kollywood, Tamil Cinema