చిరంజీవి థియేటర్‌లో చూసిన ఫస్ట్ మూవీ ఇదే..

మెగాస్టార్ చిరంజీవి.. హిందీ వెర్షన్‌  ప్రమోషన్‌లో భాగంగా అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఫర్హాన్ అఖ్తర్‌తో స్పెసల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన జీవితంలో మొదటిసారి థియేటర్‌లో చూసిన సినిమా ఏదో చెప్పారు.

news18-telugu
Updated: September 29, 2019, 1:25 PM IST
చిరంజీవి థియేటర్‌లో చూసిన ఫస్ట్ మూవీ ఇదే..
చిరంజీవి (File Photo)
  • Share this:
మెగాస్టార్ చిరంజీవి.. హిందీ వెర్షన్‌  ప్రమోషన్‌లో భాగంగా అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఫర్హాన్ అఖ్తర్‌తో స్పెసల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి, అమితాబ్ తమ మధ్యగల అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అంతేకాదు స్వాతంత్య్ర సమరయోదుడి పాత్రలో నటించాలనేది తన కల అన్నారు. భగత్ సింగ్ లాంటి పాత్రలో నటించాలనేది తన కల అన్నారు. ఆయన స్టోరీతో తన దగ్గరకు ఎవరు రాలేదన్నారు. 12 ఏళ్ల క్రితం నేను పాలిటిక్స్‌లోకి వెళ్లకముందు పరుచూరి బ్రదర్స్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో నా దగ్గరకు వచ్చారు. ఈ స్టోరీ తనను ఎంతోగానో ఆకట్టుకుంది. ఈ టైమ్‌లో అంత బడ్జెట్ పెట్టే ప్రొడ్యూసర్ ఎవరు దొరకలేదు. రాజకీయాల నుంచి తప్పుకొన్నాక నేను రీ ఎంట్రీ ఇచ్చిన మూవీని ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాను రామ్ చరణ్ నిర్మించాడు. ఆ తర్వాత ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాను తానే నిర్మిస్తానని ముందుకొచ్చాడు. అలా తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఈ సినిమాతో నెరవేరిందన్నారు.

అమితాబ్,చిరంజీవిలను ఇంటర్వ్యూ చేసిన ఫర్హాన్ అఖ్తర్ (Twitter/Photo)


మరోవైపు అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ.. తనకు ఎలాంటి డ్రీమ్ ప్రాజెక్ట్స్ లేవన్నారు. ఈ ఇంటర్వ్యూలో అమితాబ్ తన జీవితంలో తాను మొదటిసారి థియేటర్‌లో చూసిన సినిమా ఏది అంటే.. ‘జాగృతి’ అనే సినిమా అని చెప్పారు. చిరంజీవి మాట్లాడుతూ.. తాను థియేటర్‌లో చూసిన మొదటి సినిమా ‘మాయా బజార్’ అని చెప్పారు. ఇప్పటికీ తన ఆల్ టైమ్ ఫేవరేట్ మూవీ ఇదే అని చెప్పకొచ్చారు.

First published: September 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>