Home /News /movies /

MATARANI MOUNAMIDI MOVIE WILL BE RELEASED IN AUGUST SB

Matarani Mounamidi: ఆగష్టులో విడుదల కానున్న ‘మాటరాని మౌనమిది’ సినిమా

మాటరాని మౌనమిది సినిమా టీం

మాటరాని మౌనమిది సినిమా టీం

ఈ సినిమా ప్రేక్షకులకు సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలను అందిస్తూనే ఆద్యంతం ఆకట్టుకుంటుందన్నారు నిర్మాత.

    రుద్ర పిక్చర్స్ మరియు పిసిర్ గ్రూప్ సమర్పణలో శుక్ర దర్శకుడు సుకు పూర్వాజ్ చేస్తున్న కొత్త సినిమా "మాటరాని మౌనమిది". మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. లవ్ స్టొరి, థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ముల్టి జోనర్ గా రూపొందుతున్న "మాటరాని మౌనమిది" సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని ఆగష్టులో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు సుకు పూర్వాజ్ మాట్లాడుతూ..కోవిడ్ టైమ్ లో మేము తీసిన శుక్ర సినిమా గతేడాది ఏప్రిల్ లో రిలీజ్ అయ్యింది.

    ఆ సినిమా మాకు చాలా పేరు తీసుకొచ్చింది. ఆ ప్రోత్సాహంతో మాటరాని మౌనమిది చిత్రాన్ని రూపొందించాను. ఈ సినిమా ఫస్ట్ కాపీ వచ్చింది. నిన్న కొంతమందికి ప్రివ్యూ వేశామని అందరూ సినిమా బావుందన్నారు. మల్టీ జానర్ థ్రిల్లర్ బ్యాక్ గ్రౌండ్ లో ఒక కొత్త లవ్ స్టోరిని చూపిస్తున్నామన్నారు. ఆగష్టులో థియేటర్స్ లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నామని తెలిపారు. నటీనటులు, టెక్నీషియన్స్ సపోర్ట్ వల్లే ఈ చిత్రం ఇంత బాగా వచ్చిందన్నారు. మంచి కథతో వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుందన్నారు డైరెక్టర్.



    డైరెక్టర్ చెప్పిన లైన్ నచ్చడంతో ఈ సినిమా చేశామన్నారు నిర్మాత వాసుదేవ్. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా ఈ చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుందన్నారు. ఈ కథ విన్నప్పుడు ఎంత ఎగ్జైట్ అయ్యామో ప్రివ్యూ చూసిన తరువాత అంతకంటే ఎక్కువ సంతోషించామన్నారు మరో నిర్మాత ప్రభాకర్.ఈ సినిమా ప్రేక్షకులకు సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలను అందిస్తూనే ఆద్యంతం ఆకట్టుకుంటుందన్నారు. హీరో మహేష్ దత్త మాట్లాడుతూ... ఈ సినిమాతో మేమొక ఒక కొత్త అటెంప్ట్ చేశామన్నారు. మాటరాని మౌనమిది సినిమా చూసిన తరువాత అందరూ ఇదే ఫీలవుతారన్నారు. టీమ్ అంతా సినిమా కోసం అంకితభావంతో పనిచేశారని తెలిపారు. పెద్ద సినిమాలకు ఏ మాత్రం తగ్గని అషీర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారన్నారు.

    హీరోయిన్ సోనీ మాట్లాడుతూ... దర్శకుడు సుకు పూర్వాజ్ తెలుగు అమ్మాయి ప్రతిభను గుర్తించి అవకాశమిచ్చారన్నారు. ఇందులో నా క్యారెక్టర్ ఆకట్టుకునేలా ఉంటుందన్నారు. డైలాగ్స్ హార్ట్ టచింగ్ గా ఉంటాయన్నారు. టీమ్ వర్క్ చేసి మంచి ఔట్ పుట్ తీసుకొచ్చామని తెలిపారు. నేను ఇక్కడిదాకా వచ్చేందుకు కారణమైన గగన్ టెలిషో కు కృతజ్ఞతలు తెలిపారు హీరోయిన్ అర్చన. అలాగే ఈ చిత్రంలో నేను ఒక వైవిధ్యమైన పాత్రలో నటించానన్నారు. ఆ క్యారెక్టర్ చేయగలను అని నమ్మిన దర్శకుడు సుకూ పూర్వాజ్ కు థాంక్స్ తెలిపారు అర్చన. ఈ సినిమాలో మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ, అర్చన అనంత్, సుమన్ శెట్టి, సంజీవ్ , శ్రీహరి తదితరులు నటించారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Archana, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు