• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • MASTER MOVIE 1ST WEEK AP TS COLLECTIONS AND VIJAY SCORED BIGGEST HIT IN HIS CAREER PK

Master 1st Week collections: ‘మాస్టర్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. తెలుగులో విజయ్ బిగ్గెస్ట్ హిట్..

Master 1st Week collections: ‘మాస్టర్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. తెలుగులో విజయ్ బిగ్గెస్ట్ హిట్..

విజయ్ మాస్టర్ (Vijay Master)

Master 1st Week collections: టాక్ ఎలా వచ్చింది కాదు కలెక్షన్స్ ఎలా వస్తున్నాయి అనేది ముఖ్యం అంటున్నాడు మాస్టర్. విజయ్ హీరోగా వచ్చిన ఈ చిత్రం జనవరి 13న విడుదలైంది. లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంపై ముందు నుంచి కూడా అంచనాలు..

  • Share this:
టాక్ ఎలా వచ్చింది కాదు కలెక్షన్స్ ఎలా వస్తున్నాయి అనేది ముఖ్యం అంటున్నాడు మాస్టర్. విజయ్ హీరోగా వచ్చిన ఈ చిత్రం జనవరి 13న విడుదలైంది. లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంపై ముందు నుంచి కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగానే దాదాపు 2900 థియేటర్స్‌లో విడుదలైంది మాస్టర్. ప్యాండమిక్ తర్వాత ఇండియాలో అత్యధిక థియేటర్లలో విడుదలైన తొలి భారతీయ సినిమా ఇదే. ఇదిలా ఉంటే మాస్టర్ బాక్సాఫీస్ దగ్గర చరిత్ర సృష్టిస్తున్నాడు. ఈ చిత్రం తమిళనాట రికార్డులు తిరగరాస్తుంది. ఇప్పటి వరకు వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 130 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇక తెలుగులోనూ సత్తా చూపిస్తున్నాడు మాస్టర్. గతంలో విజయ్ సినిమాలకు 5 కోట్ల షేర్ వస్తేనే అబ్బో అనుకునే వాళ్లు కానీ ఇప్పుడు మాస్టర్ 50 శాతం ఆక్యుపెన్సీతోనే అద్భుతాలు చేస్తుంది. సినిమా టాక్ ఎలా ఉన్నా కూడా రోజుకు కనీసం కోటి షేర్ వసూలు చేస్తూ లాభాల బాటలో దూసుకుపోతుంది. తెలుగులో 9 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మాస్టర్.. 7 రోజుల్లో 12.82 కోట్ల షేర్ వసూలు చేసి సూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తుంది. ఏపీ, తెలంగాణలో వారం రోజుల వసూళ్లు వివరాలు..

vijay master movie collection,master box office collection,master movie 4 days collections,master 4th day box office collection,master 4 days WW collections,thalapathy vijay,master movie box office collection,master 4 days AP&TS collections,master 4 days box office collections,master total box office collection,master worldwide collection,విజయ్ మాస్టర్ కలెక్షన్స్,మాస్టర్ 4 డేస్ కలెక్షన్స్,విజయ్ మాస్టర్ 4 డేస్ ఏపీ తెలంగాణ కలెక్షన్స్
విజయ్ మాస్టర్ సినిమా కలెక్షన్స్ (Vijay Master)


ఏపీ, తెలంగాణలో ఫస్ట్ వీక్ కలెక్షన్స్..

నైజాం – 3.12 కోట్లు
సీడెడ్ – 2.49 కోట్లు
ఉత్తరాంధ్ర – 2.19 కోట్లు
ఈస్ట్ – 1.04 కోట్లు
వెస్ట్ – 1.19 కోట్లు
కృష్ణా – 1.01 కోట్లు
గుంటూరు – 1.20 కోట్లు
నెల్లూరు – 59 లక్షలు

ఏపీ తెలంగాణలో 7 డేస్ కలెక్షన్స్.. 12.82 కోట్లు షేర్ (జరిగిన బిజినెస్ 9 కోట్లు)

vijay master movie collection,master box office collection,master movie 4 days collections,master 4th day box office collection,master 4 days WW collections,thalapathy vijay,master movie box office collection,master 4 days AP&TS collections,master 4 days box office collections,master total box office collection,master worldwide collection,విజయ్ మాస్టర్ కలెక్షన్స్,మాస్టర్ 4 డేస్ కలెక్షన్స్,విజయ్ మాస్టర్ 4 డేస్ ఏపీ తెలంగాణ కలెక్షన్స్
విజయ్ మాస్టర్ సినిమా కలెక్షన్స్ (Vijay Master)


మరోవైపు తమిళనాట ఈ సినిమా వారం రోజుల్లో దాదాపు 65 కోట్లు గ్రాస్.. 40 కోట్ల షేర్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు కర్ణాటకలో కూడా మాస్టర్ హవా కనిపిస్తుంది. అక్కడ కూడా దాదాపు 13 కోట్ల వరకు వసూలు చేసింది ఈ సినిమా. ఇక ఓవర్సీస్ నుంచి 30 కోట్లకు పైగానే గ్రాస్ వసూలు చేసింది మాస్టర్. కేరళలో విజయ్‌కు అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది. అక్కడ వారం రోజుల్లో 10 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా తొలివారం 132 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. అందులో షేర్ దాదాపు 78 కోట్ల వరకు ఉంది. ఏదేమైనా ప్యాండమిక్ తర్వాత అదిరిపోయే హిట్‌తో అందరిలోనూ నమ్మకాన్ని పెంచేసాడు విజయ్.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు