నాచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో (Shyam Singha Roy) ‘శ్యామ్ సింగ రాయ్’ అనే పీరియాడిక్ డ్రామా 2021, డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషాల్లో విడుదలై మంచి ఆదరణ పొందింది. ఈ సినిమాలో నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. ఇక అది అలా ఉంటే నాని ప్రస్తుతం (Dasara) దసరా అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నాని తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ (Dasara) సినిమా ద్వారా శ్రీకాంత్ ఓదేల (Srikanth Odela) దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్ట్ సంతోష్ నారయణ్ సంగీతం అందిస్తున్నారు. ఈ (Dasara) సినిమాలో నాని డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారు. ఆయన ఈ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు. అందుకోసం ఆయన ఒక ట్యూటర్ ను కూడా పెట్టుకున్నారని అంటున్నారు. ‘దసరా’ (Dasara) సినిమా పూజా కార్యక్రమాలతో ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే.
ఇక ఈ (Dasara) సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది. దసరా సినిమా కోసం హైదరాబాద్‌లో కూకట్‌పల్లిలో దాదాపు 12 ఎకరాల్లో ఒక విలేజ్ సెట్ ను నిర్మించారట దర్శకనిర్మాతలు. ఈ సెట్ కోసం దాదాపుగా 12 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయ్యిందని టాక్. సినిమాలో కీలక సన్నివేశాలతో పాటు, సినిమాలో ఎక్కువ భాగం షూటింగు ఇక్కడే జరుగునుందట.
Set to go 🔥#Dasara pic.twitter.com/hcbPOi85H6
— Nani (@NameisNani) February 16, 2022
ఇక నాని నటించిన లేటెస్ట్ సినిమా శ్యామ్ సింగ రాయ్ విమర్శకుల ప్రశంలతో పాటు మంచి లాభాలను తెచ్చి పెట్టింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతూ.. థియేటర్స్ తక్కువుగా ఉన్నా స్థిరమైన కలెక్షన్స్‌తో అదరగొట్టింది. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు అమెరికాలో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. థియేటర్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ఈ చిత్రాన్ని నీహారిక ఎంటర్ టైన్మెంట్ పతాకం పై వెంకట్ బోయనపల్లి ఎంతో గ్రాండ్‌గా నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ సినిమా నాని కెరీర్ లోనే అత్యధికంగా 50 కోట్లతో నిర్మించారు.
Pooja Hegde: పచ్చని చెట్ల మధ్య పరువాల విందు చేసిన తుళు అందం పూజా హెగ్డే..
నాని నటిస్తున్న మరో సినిమా 'అంటే.. సుందరానికి..' ఈ సినిమాకు 'బ్రోచే వారెవరురా' ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా అడల్ట్ కామెడీ జానర్‌లో వస్తోందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. అంటే.. సుందరానికి..లో నానికి జంటగా మలయాళీ నటి నజ్రియా నజీమ్ నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dasara Movie, Hero nani, Keerthy Suresh, Tollywood news