హోమ్ /వార్తలు /సినిమా /

Prabhas Adipurush: ప్ర‌భాస్ ఆది పురుష్‌కి ఆదిలోనే హంసపాదు.. సెట్‌లో అగ్నిప్ర‌మాదం

Prabhas Adipurush: ప్ర‌భాస్ ఆది పురుష్‌కి ఆదిలోనే హంసపాదు.. సెట్‌లో అగ్నిప్ర‌మాదం

Prabhas Adipurush: రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తోన్న మ‌రో భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ఆది పురుష్. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓమ్ రౌత్ తెర‌కెక్కిస్తోన్న ఈ మూవీ షూటింగ్ ఇవాళే ప్రారంభం అయ్యింది. ముంబ‌యి గుర్‌గావ్‌లోని ఓ ఫిల్మ్ స్టూడియోలో ఆదిపురుష్‌ షూటింగ్ ఇవాళ ప్రారంభం కాగా..సాయంత్రం గం.4.15ని.ల స‌మ‌యంలో స్టూడియోలో భారీ అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది

ఇంకా చదవండి ...

  Prabhas Adipurush: రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తోన్న మ‌రో భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ఆది పురుష్. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓమ్ రౌత్ తెర‌కెక్కిస్తోన్న ఈ మూవీ షూటింగ్ ఇవాళే ప్రారంభం అయ్యింది. ముంబ‌యి గుర్‌గావ్‌లోని ఓ ఫిల్మ్ స్టూడియోలో ఆదిపురుష్‌ షూటింగ్ ఇవాళ ప్రారంభం కాగా..సాయంత్రం గం.4.15ని.ల స‌మ‌యంలో స్టూడియోలో భారీ అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. అయితే ఈ ప్ర‌మాదంలో ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని స‌మాచారం. మ‌రోవైపు ఇది లెవ‌ల్ 2 అగ్ని ప్ర‌మాద‌మ‌ని ఫైర్ సిబ్బంది అధికారులు తెలిపారు. దీనిపై చిత్ర యూనిట్ టీమ్ మెంబ‌ర్ మాట్లాడుతూ.. ఆదిపురుష్ సెట్స్‌లో ఫైర్ యాక్సిడెంట్ జ‌రిగింది. అదృష్ట‌వ‌శాత్తు ఈ ప్రమాదంలో ఎవ‌రికీ ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేదు అని ఒక జాతీయ మీడియాకు వెల్ల‌డించారు. అయితే సెట్స్‌లో కొన్ని ప‌రిక‌రాలు కాలిపోయిన‌ట్లు తెలుస్తోంది.

  అయితే రామాయణం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో ప్ర‌భాస్ రాముడిగా.. సైఫ్ అలీఖాన్ రావ‌ణాసురుడిగా క‌నిపించ‌నున్నారు. ఇక సీత పాత్ర‌లో కృతిస‌న‌న్ పేరు వినిపిస్తోంది. అలాగే ల‌క్ష్మ‌ణుడి పాత్ర‌లో మొన్నటి వరకు సన్నీ సింగ్ పేరు వినిపించగా.. తాజాగా టైగర్ ష్రాఫ్ పేరు లైన్‌లోకి వ‌చ్చింది. అలాగే రాముడి త‌ల్లి కౌశ‌ల్య పాత్ర‌లో డ్రీమ్ గ‌ర్ల్ హేమ మాలిని న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం.

  కాగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో మోష‌న్ ఫిల్మ్‌గా ఆదిపురుష్ తెర‌కెక్కనుంది. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో రానున్న ఈ సినిమాను భూష‌ణ్ కుమార్ (టీ సిరీస్), ప్ర‌సాద్ సుతార్‌, రాజేశ్ నాయ‌ర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీపై అటు బాలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ భారీ అంచ‌నాలు ఉన్నాయి.

  First published:

  Tags: Adipurush movie, Prabhas, Saif Ali Khan

  ఉత్తమ కథలు