అల్లు అర్జున్ (Allu Arjun)సుకుమార్ (Sukumar) కాంబినేషన్‌లో పుష్ప (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావోచ్చింది. ఈ సినిమా డిసెంబర్ 17 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే.. ఇప్పటికే దాక్కొ… దాక్కో మేక, శ్రీవల్లి, ” సామి సామి ”పాటలు కూడా విడుదలై అదరగొడుతుండగా ఇక మరో పాటను విడుదల చేసింది చిత్రబృందం. ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా అంటూ సాగే ఈ నాల్గవ పాటని నవంబర్ 19న విడుదల చేశారు. ఈ పాటలో లిరిక్స్ కానీ.. అల్లు అర్జున్ లుక్‌గానీ మునుపెన్నడూ లేని విధంగా ఉన్నాయి. చంద్రబోస్ రాసిన లిరిక్స్ అద్బుతంగా ఉన్నాయి. నకాష్ ఆజిజ్ పాడారు. దీంతో పాట ఇన్‌స్టాంట్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ఆకట్టుకుంటోంది. ఇక మరోవైపు ఈ చిత్రంలో నటించే నటీనటుల లుక్స్‌ను విడుదల చేస్తున్నారు. దాక్షాయనిగా అనసూయను పరిచయం చేయగా.. నటుడు సునీల్‌ను మంగలం శ్రీనుగా పరిచయం చేశారు. మరోవైపు ప్రస్తుతం ఈ సినిమా ఓ భారీ మాస్ సాంగ్‌ను చిత్రికరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాట కోసం అల్లు అర్జున్ 1000 మంది డాన్సర్లతో కలిసి షూట్‌లో పాల్గోంటున్నారు.
ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్న నటిస్తున్నారు. పుష్పలో రష్మిక పాత్ర చాలా డిఫరెంట్’గా ఉంటుందని తెలుస్తోంది. మంచి ఇంటెన్స్ గా లుక్‌లో రష్మిక అదరగొడుతూ.. ఆసక్తి కరంగా కనిపిస్తుంది. పుష్పలో రష్మిక మందన్న శ్రీవల్లి పాత్రలో కనిపించనుంది.
Make way for the MASS SWAG of Icon Staar @alluarjun with some noise ??#EyyBiddaIdhiNaaAdda Song Out Now!
- https://t.co/FImjWxbLa8#PushpaFourthSingle ?#PushpaTheRise #PushpaTheRiseOnDec17@iamRashmika @aryasukku @ThisIsDSP @AzizNakash @boselyricist @adityamusic
— Mythri Movie Makers (@MythriOfficial) November 19, 2021
ఇక ఈ సినిమాకు చెందిన మొదటి భాగం షూటింగ్ ఇటీవల ఏపీలోని మారేడు మిల్లి అడువుల్లో జరిగింది. పుష్ప లో అల్లు అర్జున్‌తో పాటు మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఫహద్ పాసిల్ (Fahadh Faasil ) ఫస్ట్ లుక్ ఆ మధ్య విడుదలై మంచి ఆదరణ పొందింది. అల్లు అర్జున్‌కు జోడిగా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటిస్తోంది.
Nagarjuna : నాగార్జున సరసన నటించడానికి కుర్ర హీరోయిన్ కోటి డిమాండ్..
ఇక ఈ సినిమా నుంచి ఇటీవల దాక్కో దాక్కో మేక (Pushpa Daakko Daakko Meka song) అనే ఊర మాస్ సాంగ్ విడుదలై సంచలనం సృష్టించింది. ఈ పాట తెలుగుతో పాటు హిందీ తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే తెలుగు వెర్షన్ కి మాత్రం అన్నిటికంటే అధిక రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు 24 గంటల్లో రియల్ టైమ్‌లో 9.4 మిలియన్ వ్యూస్‌తో 6 లక్షల 57 వేల ఆల్ టైమ్ లైక్స్‌లో సౌత్ ఇండియాలో మొదటి లిరికల్ సాంగ్‌గా రికార్డ్ సృష్టించింది.
ఈ పాటను చంద్రబోస్ రాయగా.. శివమ్ పాడారు.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఇక పుష్ప కథ విషయానికి వస్తే.. ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఓ యాక్షన్ ఫిల్మ్. ఇక పుష్ప సినిమా కథ విషయానికి వస్తే.. సుకుమార్ సక్సెస్ మంత్ర అయిన రివెంజ్ ఫార్ములాతోనే వస్తోందని టాక్. సుకుమార్ ‘వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో’ రామ్ చరణ్ రంగస్థలం ఇదే ఫార్ములాతో వచ్చినవే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. పుష్ప తెలుగు, హిందీ. తమిళ, మలయాళ, కన్నడ భాషాల్లో విడుదలకానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Allu Arjun, Pushpa film