రవితేజ అంటే మనకు కేవలం మాస్ రాజాగానే తెలుసు.. లేటు వయసులో హీరో అయ్యాడు కాబట్టి ఈయన ఇంకా చిన్నోడే అనుకుంటున్నారు. కానీ ఈయనకు చాలా పెద్ద వారసులున్నారు. దాంతో పాటు తన కుటుంబాన్ని కూడా చాలా తక్కువగా బయటికి తీసుకొస్తుంటాడు రవితేజ. ఇప్పటి వరకు ఈయన వారసులను చూసింది కూడా చాలా తక్కువ మందే. అందులోనూ కొడుకును చూసారు కానీ కూతురును మాత్రం అస్సలు చూసుండరు. ఈయన సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత కొడుకు, కూతురును పరిచయం చేసాడు రవితేజ.
అందులోనూ కొడుకు మహాధన్ రాజా ది గ్రేట్ సినిమాలో చిన్నప్పటి రవితేజగా నటించాడు. అలా చాలా మందికి పరిచయం అయ్యాడు జూనియర్ రవితేజ. కానీ కూతురు మోక్షద మాత్రం ఎక్కడా బయటికి రాలేదు.. కనిపించలేదు కూడా. అక్కడక్కడా చిన్ననాటి ఫోటోలు కనిపించడమే కానీ ఇప్పుడు ఎలా ఉందనేది మాత్రం ఎవరికీ ఐడియా ఉండదు.
ఇప్పుడు రవితేజ స్వయంగా తన కొడుకు, కూతురుతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఇంట్లోనే ఉండండి అంటూ తన పిల్లలతో దిగిన ఫోటోను పోస్ట్ చేసాడు మాస్ రాజా. ఈ ఫోటో చూసిన తర్వాత వామ్మో రవితేజకు ఇంత పెద్ద కూతురు ఉందా అని ఆశ్చర్యపోతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ravi Teja, Telugu Cinema, Tollywood