రవితేజ ఇప్పుడు స్టార్ హీరో.. కానీ ఆయన స్టార్ కావడానికి ఎన్నో ఏళ్ల శ్రమ దాగుంది. ఊరికే ఆయన స్టార్ హీరో అయిపోయలేదు. దాదాపు 20 ఏళ్ల పాటు ఇండస్ట్రీలోనే ఎన్నో కష్టాలు పడ్డాడు మాస్ రాజా. చిన్న చిన్న పాత్రలు వేస్తూ.. విలన్గా నటిస్తూ.. కమెడియన్గా చేసి చివరికి 30 ఏళ్లు దాటిన తర్వాత హీరో అయ్యాడు. ఆ తర్వాత పదేళ్ల పాటు ఇండస్ట్రీని ఊపేసాడు మాస్ రాజా. తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు రవితేజ. అలాంటి హీరోకు ఆదర్శం ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి నెంబర్ వన్ అనిపించుకున్నాడు చిరు.
ఆయనే ఎంతో మంది హీరోలకు ఆదర్శం. నీ బ్యాగ్రౌండ్ ఏంట్రా అని అడిగే వాళ్లకు కేరాఫ్ అడ్రస్ చిరంజీవి. అప్పుడైనా ఇప్పుడైనా అందరూ మెగాస్టార్ వైపు చూస్తుంటారు. అలాంటి చిరంజీవితో అప్పట్లో రవితేజ దిగిన అరుదైన ఫోటో ఇది. రవితేజ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చిరంజీవితో కలిసి నటించాడు. గ్యాంగ్ లీడర్ హిందీ రీమేక్ ఆజ్ కా గూండారాజ్లో రవితేజ కూడా ఉంటాడు. తెలుగు వర్షన్లో మరొకరు నటించారు.
దాంతో పాటే నాగార్జున నిన్నే పెళ్లాడతాలో కూడా ఓ సీన్ చేసాడు. అలా చిన్న చిన్న పాత్రలు చేస్తూనే సముద్రం లాంటి సినిమాల్లో ప్రతినాయకుడిగా నటించాడు. ఆ సమయంలోనే మెగాస్టార్ చిరంజీవిని కలిసినప్పటి అరుదైన ఫోటో ఇది. అప్పుడు ఇప్పుడు రవితేజ ఒకేలా ఉన్నాడు కానీ కాస్త బరువు పెరిగాడంతే. మిగిలిదంతా సేమ్ టూ సేమ్. ఈ ఫోటోలో రవితేజతో పాటు మరో నటుడు రాజా రవీంద్ర కూడా ఉన్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Ravi Teja, Telugu Cinema, Tollywood