హోమ్ /వార్తలు /సినిమా /

Ravi Teja: హ్యాట్రిక్ ఫ్లాపులు ఇచ్చిన హీరోయిన్‌నే రిపీట్ చేస్తున్న రవితేజ..

Ravi Teja: హ్యాట్రిక్ ఫ్లాపులు ఇచ్చిన హీరోయిన్‌నే రిపీట్ చేస్తున్న రవితేజ..

రవితేజ (Ravi Teja)

రవితేజ (Ravi Teja)

Ravi Teja: ఫ్లాపులు వచ్చినా కూడా రవితేజ జోరు మాత్రం తగ్గడం లేదు. వరస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈయన దూకుడు చూసి అంతా షాక్ అవుతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమాలో నటిస్తున్నాడు..

ఫ్లాపులు వచ్చినా కూడా రవితేజ జోరు మాత్రం తగ్గడం లేదు. వరస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈయన దూకుడు చూసి అంతా షాక్ అవుతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమాలో నటిస్తున్నాడు రవితేజ. ఈ చిత్రం షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. తమిళనాట సూపర్ హిట్ అయిన సేతుపతి సినిమా ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. మాస్ రాజా ఇమేజ్‌కు సరిపోయేలా కథలో మార్పులు చేసాడు దర్శకుడు గోపీచంద్. ఈ చిత్రంలో శృతి హాసన్ మరోసారి రవితేజతో రొమాన్స్ చేస్తుంది. కాటమరాయుడు తర్వాత తెలుగులో కనిపించడం మానేసిన శృతి.. ఇప్పుడు మరోసారి మాస్ రాజా సినిమాతో వస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటే త్రినాథరావు నక్కినతో ఓ సినిమా.. రమేష్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా.. వక్కంతం వంశీ దర్శకత్వంలో ఇంకో సినిమా చేస్తున్నాడు. ఇవన్నీ ఇలా ఉండగానే నాలుగో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు.

ravi teja,ravi teja twitter,ravi teja ileana d cruz,ravi teja ileana d cruz movie,ravi teja ileana d cruz maruthi movie,ravi teja ileana d cruz movies,telugu cinema,రవితేజ,ఇలియానా,రవితేజ ఇలియానా మారుతి సినిమా
రవితేజ (Twitter/Photo)

త్వరలోనే మారుతి దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయబోతున్నాడు. ఆయన ఇమేజ్‌కు సరిపోయే పక్కా ఎంటర్‌టైన్‌మెంట్ కథను మారుతి సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. అందులో నటించడానికి రవితేజ కూడా ఓకే చెప్పడంతో త్వరలోనే దీనిపై పూర్తి వివరాలు బయటికి రానున్నాయి. అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఇలియానా కనిపించబోతుందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే నాలుగు సినిమాల్లో ఈ జోడీ కలిసి నటించారు.

ravi teja,ravi teja twitter,ravi teja ileana d cruz,ravi teja ileana d cruz movie,ravi teja ileana d cruz maruthi movie,ravi teja ileana d cruz movies,telugu cinema,రవితేజ,ఇలియానా,రవితేజ ఇలియానా మారుతి సినిమా
రవితేజ ఇలియానా (Ravi Teja Ileana)

కిక్‌తో బ్లాక్‌బస్టర్ అందుకున్న తర్వాత ఖతర్నాక్, దేవుడు చేసిన మనుషులు, అమర్ అక్బర్ ఆంటోనీ లాంటి డిజాస్టర్ సినిమాలు చేసారు. అయినా కూడా సెంటిమెంట్ పట్టించుకోకుండా మరోసారి ఇలియానాతో రొమాన్స్ చేయడానికి మాస్ రాజా సిద్ధమవుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కానీ జరిగితే ఇలియానా కెరీర్‌కు మంచి బ్రేక్ దొరికినట్లే. చూడాలిక.. ఏం జరుగుతుందో..?

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Ileana D'cruz, Ravi Teja, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు