హోమ్ /వార్తలు /సినిమా /

Ravi Teja- Khiladi: నిలిచిపోయిన మాస్‌రాజా ర‌వితేజ ఖిలాడి షూటింగ్.. అస‌లు కార‌ణం ఇదే

Ravi Teja- Khiladi: నిలిచిపోయిన మాస్‌రాజా ర‌వితేజ ఖిలాడి షూటింగ్.. అస‌లు కార‌ణం ఇదే

Ravi Teja Khiladi: ఈ ఏడాది క్రాక్‌తో మంచి విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్న మాస్‌రాజా ర‌వితేజ ప్ర‌స్తుతం ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఖిలాడి చిత్రంలో నటిస్తోన్న విష‌యం తెలిసిందే. స‌త్య‌నారాయ‌ణ కోనేరు నిర్మిస్తోన్న ఈ మూవీని మే 28న‌ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు ఇప్ప‌టికే చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

ఇంకా చదవండి ...

  Ravi Teja Khiladi: ఈ ఏడాది క్రాక్‌తో మంచి విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్న మాస్‌రాజా ర‌వితేజ ప్ర‌స్తుతం ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఖిలాడి చిత్రంలో నటిస్తోన్న విష‌యం తెలిసిందే. స‌త్య‌నారాయ‌ణ కోనేరు నిర్మిస్తోన్న ఈ మూవీని మే 28న‌ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు ఇప్ప‌టికే చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలో షూటింగ్‌ను కూడా శ‌ర‌వేగంగా చేస్తూ వ‌స్తున్నాడు ద‌ర్శ‌కుడు. అయితే తాజా స‌మాచారం ప్రకారం ఈ మూవీ షూటింగ్ వాయిదా ప‌డిందట‌. ఖిలాడి మూవీ షూటింగ్ కోసం ఇటీవ‌ల చిత్ర యూనిట్ ఇటలీకి వెళ్లింది. అక్క‌డ కొంచెం షూటింగ్ కూడా జ‌రిగింది. అయితే ఇట‌లీలో ఇటీవ‌ల క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతూ వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఖిలాడి షూటింగ్ జ‌రిగే ప్ర‌దేశంలో లాక్‌డౌన్‌ను పెట్టారు. దీంతో ర‌వితేజ మూవీ షూటింగ్ ఆగిపోయిన‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు మ‌రోవైపు ఈ నెలాఖ‌రు వ‌ర‌కే అక్క‌డ షూటింగ్‌ను ప్లాన్ చేయ‌గా.. ఇప్పుడు లాక్‌డౌన్ నేప‌థ్యంలో మూవీ యూనిట్ కూడా హైదరాబాద్‌కు వెనుదిరిగి వ‌చ్చే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం.

  ఇదిలా ఉంటే యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో ర‌వితేజ డ‌బుల్ యాక్ష‌న్‌లో న‌టిస్తున్నారు. ఆయ‌న స‌ర‌స‌న డింపుల్ హ‌య‌తీ, మీనాక్షి చౌద‌రీలు క‌నిపిస్తున్నారు. అర్జున్, ఉన్ని ముకుంద‌న్, అన‌సూయ‌, నిఖితిన్ ధీర్, వెన్నెల కిశోర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే పోస్ట‌ర్‌లతో ఆక‌ట్టుకున్న ఈ చిత్రంపై ర‌వితేజ అభిమానుల్లో మంచి అంచ‌నాలు ఉన్నాయి.

  అయితే ఒక ఊరిలో మూవీ ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయిన ర‌మేష్ వ‌ర్మ న‌క్కిన గ‌తంలో ర‌వితేజ‌తో వీర అనే చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ చిత్రం అనుకున్నంత విజ‌యాన్ని సాధించ‌లేదు. ఇక 2019 బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా త‌మిళంలో మంచి విజ‌యం సాధించిన రాచ్ష‌స‌న్‌ను తెలుగులో రాక్షసుడు పేరుతో రమేష్ వ‌ర్మ తెరకెక్కించారు. ఇప్పుడు ర‌వితేజ‌తో తెర‌కెక్కించే ఖిలాడి కూడా షూటింగ్ పూర్తి అయ్యి విడుదల కానీ ఓ త‌మిళ చిత్ర రీమేక్ అని తెలుస్తోంది. కాగా ఈ మూవీ త‌రువాత ర‌వితేజ త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో ఓ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌లో న‌టించ‌నున్నారు.

  First published:

  Tags: Ravi Teja

  ఉత్తమ కథలు