రవితేజ (Ravi Teja) ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు.. వరస సినిమాలు చేస్తున్నాడు. ఒకటి రెండు కాదు.. ఏకంగా అరడజన్ సినిమాలతో వచ్చేస్తున్నాడు మాస్ రాజా. ఖిలాడి (Khiladi) డిజాస్టర్ తర్వాత కూడా ఈయన జోరు తగ్గడం లేదు. క్రాక్ (Krack) సినిమాతో ట్రాక్ ఎక్కాడని సంతోషించే లోపే.. ఖిలాడి వచ్చేసింది. ఈ చిత్రం దారుణంగా నిరాశ పరిచింది. ఇదిలా ఉంటే జూన్ 17న రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు రవితేజ. శరత్ మండవ (Sharath Mandava) తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే అయిపోయింది. విడుదలకు సిద్ధంగా ఉంది ఈ చిత్రం. వీటితో పాటు రవితేజ నటిస్తున్న మరో సినిమా ధమాకా (Dhamaka). త్రినాథరావు నక్కిన (Trinadha Rao Nakkina) తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ప్రసన్న కుమార్ బెజవాడ (Prasanna Kumar Bezawada) కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు.
పక్కా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ధమాకా వచ్చేస్తుంది. పైగా సినిమా చూపిస్త మావా, నేను లోకల్, హలో గురు ప్రేమకోసమే లాంటి హ్యాట్రిక్ విజయాల తర్వాత ప్రసన్న, త్రినాథరావు కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. ధమాకా సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. రవితేజ అభిమానులు అయితే ఈ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తున్నారు. పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీల (sreeleela) ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా ఈ చిత్ర కథ లీక్ అయింది. ధమాకా స్టోరీ లైన్ ఇదే అంటూ సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తుంది. ఈ సినిమాలో రెండు భిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు రవితేజ.
అందుకే టైటిల్‌లోనే డబుల్ ఇంపాక్ట్ అని పెట్టారు. కాసేపు ఓ కంపెనీ సిఈఓగా.. బాగా డబ్బున్న వాడిగా కనిపించే రవితేజ.. మరికాసేపు మాత్రం మిడిల్ క్లాస్ పర్సన్‌గా నటించనున్నాడని తెలుస్తుంది. సీఈఓ పాత్ర కొన్ని ఇబ్బందుల్లో పడి కనిపించకపోవడం.. అదే సమయంలో మిడిల్ క్లాస్ వ్యక్తిని చూసి తాము అనుకుంటున్న సీఈఓ ఇతడే అని రౌడీలు ఆయన్ని తీసుకెళ్లడంతో కథ మలుపు తిరుగుతుందని తెలుస్తుంది. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని తెలుస్తుంది. కానీ అలాంటిదేం లేదు.. ఒకే పాత్ర రెండు భిన్నమైన కోణాల్లో కనిపిస్తుందనే ప్రచారం కూడా జరుగుతుంది. సినిమా ఇదే ఏడాది విడుదల కానుంది. ధమాకాతో పాటు రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు కూడా చేస్తున్నాడు రవితేజ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dhamaka, Ravi Teja, Telugu Cinema, Tollywood