హోమ్ /వార్తలు /సినిమా /

Hero Ravi Teja: నిర్మాత‌గా మారుతున్న హీరో ర‌వితేజ‌.. బ్యాన‌ర్ పేరు వివ‌రాలేంటో తెలుసా...!

Hero Ravi Teja: నిర్మాత‌గా మారుతున్న హీరో ర‌వితేజ‌.. బ్యాన‌ర్ పేరు వివ‌రాలేంటో తెలుసా...!

ర‌వితేజ‌.. Photo : Twitter

ర‌వితేజ‌.. Photo : Twitter

Hero Ravi Teja: హీరో రవితేజ త్వరలోనే నిర్మాతగా మారుతున్నాడనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన స్టార్ట్ చేసిన వివరాలు తెలిశాయి.. ఆ వివరాలు మీకోసం...

  సినీ ఇండ‌స్ట్రీలో ఎలాంటి అండ దండ‌లు లేకుండా స్వ‌యంకృషితో ఎదిగిన హీరోల్లో ర‌వితేజ ఒక‌రు. త‌న‌దైన బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్ డెలివ‌రీతో ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న ర‌వితేజ‌ను అంద‌రూ ముద్దుగా మాస్ మ‌హారాజ అని పిలుచుకుంటూ ఉంటారు. ఈయ‌న జ‌ర్నీ గురించి అంద‌రికీ తెలిసిందే. అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా త‌న కెరీర్‌ను స్టార్ట్ చేసిన ర‌వితేజ త‌ర్వాత చిన్నా చిత‌క వేషాలు వేసే న‌టుడిగా మారారు. ఆ త‌ర్వాత హీరోగా త‌న‌ ప్ర‌యాణాన్ని ప్రారంభించారు. వ‌రుస విజ‌యాల‌తో త‌న‌కంటూ గుర్తింపు సంపాదించుకుంటూ స్టార్ హీరోగా మారారు.

  ఇప్పుడు ర‌వితేజ త‌న కొత్త ప్ర‌యాణాన్ని ప్రారంభిస్తాడ‌ని వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. అదేంటంటే, త్వ‌ర‌లోనే ర‌వితేజ నిర్మాత‌గా మారబోతున్నాడ‌ట‌. హీరోగా కూడా కొత్త ద‌ర్శ‌కుల‌తో సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపించే హీరో ర‌వితేజ‌.. అదే స్ఫూర్తితో కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యార‌ట‌. అందులో భాగంగా ‘ఆర్.టి. వర్క్స్’ పేరుతో ఓ బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేశాడ‌ట మాస్ మ‌హారాజ‌. త‌క్కువ, మ‌ధ్య ర‌క‌మైన బ‌డ్జెట్ మూవీల‌ను కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూ చేయాల‌నుకుంటున్నాడ‌ట ర‌వితేజ‌.

  మ‌రి ఇందులో నిజా నిజాలేంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగ‌క త‌ప్ప‌దు. ఈ ఏడాది సంక్రాంతికి ‘క్రాక్‌’ సినిమాతో సంద‌డి చేసి కెరీర్ బెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు ర‌వితేజ‌. ఇప్పుడు ‘ఖిలాడి’ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా మే 28న విడుద‌ల‌వుతుంది.

  Published by:Anil
  First published:

  Tags: Ravi Teja

  ఉత్తమ కథలు