తనదైన బాడీ లాంగ్వేజ్‌తో ఓ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న మాస్ మహారాజా రవితేజ .. ఈ ఏడాది సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. క్రాక్‌తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు. నిజానికి ఈ హిట్ ఇటు హీరో రవితేజ, అటు డైరెక్టర్ గోపీచంద్ మలినేనికి ఎంతో అవసరం అయిన సందర్భంలో హిట్ కాదు.. ఏకంగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. యాబై కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సాధించిన రవితేజ మరింత స్పీడుగా సినిమాలు చేస్తున్నాడు. తాజా సమాచారం మేరకు రవితేజ తన రెమ్యునరేషన్‌తో నిర్మాతలకు షాక్ ఇవ్వడానికి రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటి వరకు ప్రతి సినిమాకు రవితేజ పది కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసేవాడు. నిర్మాత రిక్వెస్ట్ చేస్తే ఓ అరకోటి తగ్గించుకునేవాడు. అంత కంటే తగ్గాలంటే మాత్రం సినిమానే పక్కన పెట్టేసేవాడు కానీ.. రెమ్యునరేషన్ విషయంలో అంత పక్కాగా ఉండేవాడు. పూర్తి మొత్తం అందిన తర్వాతే డబ్బింగ్ పూర్తి చేసేవాడు కూడా. రవితేజకు హిట్స్ లేనప్పుడు అంత రెమ్యునరేషన్ ఇవ్వాలా అని నిర్మాతలు ఆలోచించేవారు. కానీ సాలిడ్ హిట్ పడితే.. కరోనా టైమ్‌లోనూ బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపే హీరో రవితేజ అని క్రాక్‌తో ప్రూవ్ అయ్యింది.
ఈ క్రేజ్‌ను రవితేజ మరో అడుగు ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా మాస్ మహారాజ తన రెమ్యునరేషన్‌ను దాదాపు సగానికి పైగా పెంచాడంటూ టాక్. ఇకపై రవితేజతో సినిమా చేయాలంటే నిర్మాత పదహారు కోట్ల రూపాయలు రెమ్యునరేషన్‌గా ఇవ్వాలట. కాస్త పెద్ద బ్యానర్, పెద్ద డైరెక్టర్ అయితే ఒకటో అరో తగ్గుతాడు. ఏ నిర్మాత అంత మొత్తాన్ని ఇవ్వడానికి రెడీగా ఉంటాడో అతనితోనే సినిమా చేద్దామని రవితేజ ఆలోచిస్తున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.