హోమ్ /వార్తలు /సినిమా /

Mass Maha Raja Raviteja: ర‌వితేజ 68... ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌ల‌తో రొమాన్స్

Mass Maha Raja Raviteja: ర‌వితేజ 68... ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌ల‌తో రొమాన్స్

Mass Maharaja Raviteja romancing with two heroines in his next with nakkina trinatha rao movie

Mass Maharaja Raviteja romancing with two heroines in his next with nakkina trinatha rao movie

Mass Maha Raja Raviteja: డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ లేటెస్ట్‌గా అనౌన్స్ చేసిన సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌తో రొమాన్స్ చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

  మాస్ మ‌హారాజా ర‌వితేజ‌... వ‌రుస సినిమాలతో బిజి బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది ‘క్రాక్’‌తో సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టిన ర‌వితేజ‌, ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా వెంట‌నే ‘ఖిలాడి’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. మార్చిలోపు ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాల‌నేది ర‌వితేజ ప్లానింగ్‌. ఈ సినిమా కూడా తుది ద‌శ‌కు చేరుకుంది. ఆలోప‌లే నెక్ట్స్ మూవీకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న‌ను ఇచ్చాడు ర‌వితేజ‌. త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో టీజీవిశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ కాంబినేష‌న్‌లో ఈ సినిమా రూపొంద‌నుంది.

  రవితేజ 68వ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు.. ఈ చిత్రంలో ఇద్ద‌రు హీరోయిన్స్ న‌టిస్తున్నారు. ఇద్ద‌రు హీరోయిన్స్ ఎవ‌రో కారు.. ఐశ్వ‌ర్య మీన‌న్‌, శ్రీలీల‌. వీరిద్ద‌రిలో ఐశ్వ‌ర్య‌మీన‌న్ 2012లో వ‌చ్చిన ల‌వ్ ఫెయిల్యూర్‌లో న‌టించింది. అలాగే శ్రీలీల ఇప్పుడు పెళ్లి సంద‌డి సినిమాలో న‌టిస్తుంది. ఇది ఆమెకు రెండో సినిమా ఇది. ఏప్రిల్ నుంచి సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది.

  ఈ సినిమాకు సంబంధించి ర‌వితేజ హ్యూజ్ రెమ్యున‌రేష‌న్‌.. రూ.16 కోట్లు డిమాండ్ చేశాడ‌ని స‌మాచారం. మ‌రి నిర్మాత‌లు ఎంత వ‌ర‌కు ఇచ్చారో తెలియ‌దు. క్రాక్ స‌క్సెస్‌తో పెరిగిన మార్కెట్‌ను బేస్ చేసుకుని ర‌వితేజ త‌న రెమ్యున‌రేష‌న్ పెంచాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

  Published by:Anil
  First published:

  Tags: Ravi Teja

  ఉత్తమ కథలు