మాస్ మహారాజా హీరో రవితేజ డిస్కో రాజా సినిమా తాజా టీజర్ విడుదలైంది. ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు రెడీ అయ్యానన్నట్లు రవితేజ ఎనర్జీ చూస్తుంటే.. అభిమానులకు నవ్వుల విందే అన్నట్లు స్పష్టం అవుతోంది. రాజా ది గ్రేట్ సినిమాతో హిట్ కొట్టిన రవితేజ.. ఆ తర్వాత ఊసురుమనిపించాడు. అయితే.. ఇప్పుడు టీజర్‌తో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాడు. సైన్స్‌తో ఏదైనా సాధ్యమే.. గుడ్, బ్యాడ్, క్రేజీ అంటూ వచ్చిన మోషన్ పోస్టర్ ఇప్పటికే అదిరిపోయింది. ఇది చూస్తుంటే మళ్లీ ప్రయోగమే చేస్తున్నట్లు అర్థమైపోతుంది.
ఎక్కడికి పోతావు చిన్నవాడా.. ఒక్కక్షణం లాంటి భిన్నమైన సినిమాల తర్వాత విఐ ఆనంద్ చేస్తున్న సినిమా ఇది. ఇందులో ఈయన ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ నభా నటేష్.. ఆర్ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్‌పుత్.. తాన్యా హోప్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. నేలటికెట్టు నిర్మాత రామ్ తల్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ వచ్చేస్తుంది. పూర్తిగా సైన్స్ ఫిక్షన్ కథతోనే వస్తుంది డిస్కో రాజా.
తన కెరీర్లో ఇప్పటి వరకు చేయని ఓ కొత్త జోనర్లో ఈ చిత్రం ట్రై చేస్తున్నాడు రవితేజ. తండ్రీ కొడుకులుగా రెండు పాత్రల్లో రవితేజ నటిస్తున్నాడని తెలుస్తుంది. రవితేజకు ఇదే తొలి సైన్స్ ఫిక్షన్ కథ. ప్రయోగాత్మక కథను వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు విఐ ఆనంద్. మరోసారి థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Disco Raja, Ravi Teja, Telugu Movie News, Tollywood