HOME » NEWS » movies » MASS MAHARAJA RAVITEJA KRACK MOVIE REJECTED BY A STAR HERO FIRST MHN

Raviteja - Krack: ‘క్రాక్‌’ను ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడు.. ర‌వితేజ ప‌ట్టేశాడు..!

Raviteja - Krack: రవితేజ హీరోగా చేసిన క్రాక్ సినిమాను నిజానికి మరో స్టార్ హీరో చేయాల్సిందట. ఆయన కథ నచ్చక వద్దనడంతో అవకాశం రవితేజకు వెళ్లి హిట్ అందుకున్నాడు. ఇంతకీ క్రాక్‌ను వద్దన్న హీరో ఎవరో తెలుసా..

news18-telugu
Updated: January 13, 2021, 12:13 PM IST
Raviteja  - Krack: ‘క్రాక్‌’ను ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడు.. ర‌వితేజ ప‌ట్టేశాడు..!
Mass Maharaja Raviteja Krack movie rejected by a star hero first
  • Share this:
కొన్నిసార్లు అంతే అదృష్టం మ‌న ద‌గ్గ‌ర‌కు వ‌స్తే ప‌ట్టించుకోం. అది టేక్ డైవర్ష‌న్ అని వెళ్లిపోయాక అరే అని బాధ‌ప‌డుతుంటాం. ఇప్పుడు ఓ భారీ హిట్ సినిమా విష‌యంలో ఓ స్టార్ హీరో అలాగే బాధ‌ప‌డుతున్నాడ‌ట‌. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు..‘క్రాక్‌’. ర‌వితేజ హీరోగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం సంక్రాంతి రేసులో ముందుగానే విడుద‌లై బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్‌తో భారీ వసూళ్ల‌ను సాధిస్తుంది. నిజానికి ఈ సినిమా స్టోరితో ద‌ర్శ‌కుడు గోపీచంద్ ముందుగా ఓ స్టార్ హీరోను క‌లిశాడ‌ట‌. అయితే స‌ద‌రుస్టార్ హీరో స్టోరిని రిజెక్ట్ చేశాడ‌ట‌. ఇంత‌కీ ఆ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?..విక్ట‌రీ వెంక‌టేశ్‌.

ఘ‌ర్ష‌ణ త‌ర‌హా ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా వెంక‌టేశ్‌ను చూపించాల‌నే ఆలోచ‌న‌తో గోపీచంద్ మ‌లినేని క్రాక్ క‌థ‌ను త‌యారు చేసుకున్నాడు. వెంక‌టేశ్‌ను క‌లిస్తే ఆయ‌న పెద్ద‌గా ఆస‌క్తి చూప‌లేదు. క‌థ అటు ఇటు తిరిగి రవితేజ ద‌గ్గ‌ర‌కు వెళ్లింది. ఇక చెప్పేదేముంది. పోత‌రాజు వీర‌శంక‌ర్ పాత్ర‌లో ర‌వితేజ ఒదిగిపోయిన తీరుకి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.

raviteja, krack, raviteja krack movie, victory venkatesh, director gopichand malineni, krack movie behind story, director gopichand malineni, raviteja sankranti block buster movie, krack sankranti hit, రవితేజ, క్రాక్, వెంకటేశ్, గోపీచంద్ మలినేని
Mass Maharaja Raviteja Krack movie rejected by a star hero first


తొలిరోజు.. దాదాపు మూడు ఆట‌లు ప‌డలేదు. సెకండ్‌షో నుండి సినిమా దుమ్ములేపుతుంద‌నే చెప్పాలి. కోవిడ్ టైమ్‌లోనూ యాబై శాతం ఆక్యుపెన్సీతో సినిమా తొలి రెండు రోజుల్లోనే ప‌దికోట్ల రూపాయ‌ల గ్రాస్‌ను వ‌సూలు చేసింది. చాలా రోజులుగా సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న ర‌వితేజ‌కు, ఆయ‌న అభిమానుల‌కు ఆక‌లి తీర్చిన సినిమా అని చెప్పొచ్చు.
Published by: Anil
First published: January 13, 2021, 12:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading